ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

NATURAL OILS AVAILABLE FOR SKIN DISEASES AND SKIN CARE REGULARLY - TIPS FOR SHINY SKIN WITH NATURAL OILS





చర్మ వ్యాధులను ఉపశమింపచేయడానికిగానీ, పూర్తిగా నివారించడానికిగానీ ఆయుర్వేదంలో రెండు రకాల తైలాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఔషధ గింజల నుంచి తీసిన తైలాన్ని చర్మంపైన లేపనంగాగానీ, మర్దన కోసంగానీ వాడేవి మొదటి రకం. వీటిని ఏకమూలికా తైలాలు అంటారు. ఇవి
ఉపశమనానికి ఉపయోగపడతాయి. ఇక చర్మ వ్యాధులను నివారించేందుకు వాడేవి రెండవ రకం. కొన్ని రకాల వనమూలికల బెరడు, ఆకులు, గింజలు, పళ్ల తొక్కలు, పూరేకులు ముద్దగా దంచి పెట్టుకుని వీటికి తగిన నిష్పత్తిలో నువ్వుల నూనె లేక ఆముదం నూనె, కొబ్బరి నూనె తగిన నిష్పత్తిలో తీసుకుని మంచి నీళ్ళుగాని లేక అదే మూలికల కషాయాన్నిగానీ కలిపి అన్నీ ఓ పాత్రలోకి చేర్చి నిపుణులైన ఆయుర్వేద వైద్యులు, ఫార్మాసిస్టులు తయారు చేసేవి. వైద్యుడు ఆయా మూలికల గుణగణాల ఆధారంగా ఫార్ములా ఆయిల్స్‌ తయారు చేస్తాడు. ఆధునికంగా మరో రెండు తైలాలు కూడా వాడుకలోకి వచ్చాయి. వాటిలో ఇగిరే ధర్మం కలిగిన సుగంధ తైలాలు(ఎస్ప్సెన్స్‌ ఆయిల్స్‌/ఓలటైల్‌ ఆయిల్స్‌) 'అర్కం'(డిస్టిలేషన్‌ మెథడ్‌)లో తయారు చేస్తారు. ఇలా మూలికల నుంచే కాకుండా 'ఇము' పక్షులు, కార్డ్‌ చేపల నుంచి కూడా తైలాలను తయారు చేస్తారు. చర్మ వ్యాధులకు ఉపయోగించే తైలాలన్నీ దాదాపు చర్మంపైన పూత లేదా మర్దన రూపంలోనే
ఉపయోగించాలి. ఇలా ఔషధ గుణాలను చర్మం ద్వారా శరీరంలోకి చొప్పించడం ద్వారా, చర్మం సమస్యను శుభ్రపర్చడం, మాన్పడం సాధ్యమవుతుంది. మర్దనతో తైలం రక్తాన్ని చేరి రక్త శుద్ధి లేదా చర్మవ్యాధికి కారణమైన రక్తంలోని సూక్ష్మక్రిములను కూడా చంపేస్తుంది. వీటితో పాటు రక్తశుద్ధిని చేసే ఇతర ఔషధాలను కడుపులోకి తీసుకోవడం ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. ఫలితంగా చర్మ వ్యాధులు సమూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. అన్ని రకాల చర్మవ్యాధులకు ఆయుర్వేదం రక్తదోషాన్ని కారణంగా భావిస్తుంది. అందుకే రక్తశుద్ధి చికిత్సలకు ఆయుర్వేదం ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.

ఏకమూలికా తైలాలు : ఆముదం నూనెలో ఉండే 'అన్‌డిసైలెనిక్‌ యాసిడ్‌' రసాయనం చర్మ వ్యాధుల పైన పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐసోసి ్టయరిక్‌ యాసిడ్‌, సక్సినిక్‌ యాసిడ్‌లు స్కిన్‌ కండిష నింగ్‌కు ఉపయోగ పడ తాయి. ఈ నూనెలో
ఉండే రిసోనిక్‌ యాసిడ్‌ చర్మవ్యాధుల్లో వచ్చేవాపును అరికడుతుంది. ఇప్పుడు వస్తున్న స్కిన్‌ ఆయింట్‌మెంట్లలో ఆముదపు నూనెను వినియోగించడానికి ఇదే కారణం. సాంప్రదాయక గృహవైద్యంలో కూడా ఆముదం వినియోగం ఎక్కువగానే కనిపిస్తుంది. పొడిబారిన చర్మంపైన తేమ నిలవడానికి, వెంట్రుకలు ఏపుగా ఎదగడానికి, నల్లబడటానికి కూడా ఆముదపు నూనెను వాడతారు. కనురెప్పల మీద వచ్చే కురుపులు తగ్గడానికి ఆముదపు చుక్కలు కంట్లో వేయడం గానీ, ఆముదపు దీపంతో ఏర్పడే మసిని కాటుకగా వాడటం కూడా చాలా మందికి అలవాటుగా ఉంది. అలాగే చర్మంపైన ఏర్పడే కురుపులు లేదా పుండ్లకు పూతలా రాయడం కూడా చూస్తూ
ఉంటాం. ఈ చికిత్సలన్నీ ఎంతో ఫలితాన్నిస్తాయి.

కలౌంజీ నూనె : కలౌంజీ గింజలను బ్లాక్‌సీడ్స్‌ లేదా కార్‌వే సీడ్స్‌ అంటారు. ఈ నూనెతో తలపై రోజూ మర్దన చేయడం ద్వారా జుట్టు రాలిపోవడం చాలా వరకు ఆగి పోతుంది. అలాగే ఈ నూనెకు తగినంత వెనెగార్‌ కలిపి మొటిమల మీద పూస్తే తగ్గే అవకాశం ఉంది. పై సమస్యల్లో ఈ నూనెను అరచెంచా చొప్పున కొంచెం తేనెతో కలిపి కడుపులోకి తీసుకుంటే మరింత ప్రయోజనం
ఉంటుంది. చర్మ క్యాన్సర్‌లో కూడా ఈ నూనెతో ఫలితం కనిపిస్తుంది.

నువ్వుల నూనె : ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌ కారణంగా మెలనిన్‌ వర్ణ రసాయనాల కారణంగా నెరసిన జుట్టు నల్లబడుతుంది. జుట్టురాలకుండా ఆగిపోతుంది. ఈ నూనెలో విటమిన్‌ 'ఇ', మెగ్నీషియం, కాపర్‌ ఐరన్‌, జింక్‌ కూడా ఉండడం వల్ల చర్మ రక్షణకు ఈ నూనెతో చేసిన మర్ధన ఎంతో
ఉపయోగపడుతుంది.

ఆలివ్‌ నూనె : పొడిబారే చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఎంతో ప్రసిద్ధమైన తైలమిది. ఫేషియల్స్‌కి గానీ, బాడీ పాలిషింగ్‌లోగానీ ఆయిల్‌ క్లెస్సర్‌గా ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్‌-ఇ సమృద్ధిగా ఉండడం వల్ల చర్మ రక్షణకు బాగా తోడ్పడుతుంది. చర్మ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడే ధర్మం కూడా ఈ నూనెలో ఉంది.

చాల్మోగ్రా నూనె : ఈ నూనెకు 'తువరక తైలం' అనే పేరు కూడా
ఉంది. చర్మవ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కుష్టువ్యాధిలో వచ్చే వ్రణాలకు డ్రెస్సింగ్‌ చేయడానికి బాగా
ఉపయోగపడుతుంది. సిఫిలిస్‌, గనేరియా, సంబంధిత పుండ్లను కూడా ఈ నూనె బాగా తగ్గిస్తుంది. ఇవే కాకుండా రింగ్‌వార్మ్‌, ఎగ్జిమా, స్కైబీస్‌ వంటి చర్మవ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రసవానంతరం జననాంగం నుండి దుర్గంధం వచ్చే సందర్భాల్లో ఈ తైలంలో ముంచిన స్టెరైల్‌ టాంపూస్‌ను

ఉపయోగించవచ్చు. దీర్ఘకాలిక చర్మవ్యాధులన్నిటిలోనూ ఈ తైలాన్ని వైద్య పర్యవేక్షణలో కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.