కావలసిన పదార్థాలు :
లేత వేటమాంసం...అరకేజీ, పసుపు-అర టీస్పూన్, ఉప్పు-తగినంత, వెల్లుల్లి రేకలు- పది, అల్లం-అరంగుళంముక్క, నూనె-3టీస్పూన్ల్, లవంగాలు-నాలుగు, యాలకులు-నాలుగు, దాల్చిన చెక్క-కాస్తంత, బే ఆకులు-రెండు, గోంగూర-200గ్రా, పచ్చిమిర్చి-తగినన్ని, ఉల్లిపాయ-ఒకటి, కరివేపాకు- తగినంత,
తయారీ విధానం : ప్రెజర్ కుక్క ర్‌లో మటన్, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి ఉడికించాలి. మూకుడులో నూనె వేడిచేసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బే ఆకులు, వేసి వేయించాలి.
అల్లం, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిముక్కల్ని వేసి వేయించాలి. ఆ తరువాత కరివేపాకు, గోంగూర, పసుపు కూడా వేసి నూనె పైకి తేలేంతదాకా ఉడికించాలి. చివర్లో మాంసం ముక్కల్ని కలిపి 5నుంచి 10 నిమిషాల వరకు ఉడికించి, ఆ తరువాత తగినన్ని నీళ్ళుపోసి మళ్ళీ చిక్కబడేంతదాకా ఉడికించాలి.
చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే పుల్లటి రుచితో అలరించే గోంగూర వేటమాంసం కర్రీ తయార్...!!