ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడికి తట్టుకోలేక మనకు వడ దెబ్బ తగులు తుంది. పసివాళ్ళు, ముసలివాళ్ళు దీనికి గురవుతారు. కొందరు చనిపోతుం టారు కూడా! మన శరీరంలో చాలా నీరు ఉంటుంది ఇది చెమట రూపంలో బయటికి పోతుంది. దానితోపాటు ఉప్పు కూడా పోతుంది. అందువల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఒళ్ళు కాలిపోతుంది. తెలివి తప్పి పడిపోతారు దానినే వడదెబ్బ అంటారు. ఇది చాలా అపాయం మొదట శరీరం వేడి తగ్గించాలి. దెబ్బతగిలిన మనిషిని నీడలో పడుకోబెట్టి ఒంటిమీది గుడ్డలు తీసి, తడి గుడ్డతో మాటి మాటికి తుడవాలి. గాలి విసరాలి. వేడి తగ్గేందో లేదో నిమిష నిమిషాకి చూడాలి. తేలివ వచ్చేదాకా ఏమి తాగించకూడదు. ఎండా కాలంలో మంచి నీళ్ళు బాగా తాగాలి. ఉప్పు కలిపిన గంజినీళ్లు నీరు మజ్జిగ తాగితే మంచిది ఎండకు కొందరికి బలహీనంగా ఉంటుంది. వీకి ఉప్పు, పంచదార కలిపి నీరు తాగడం మంచిది. సాధార ణంగా ప్రతి వ్యక్తికి శరీరం యొక్క 98.6 డిగ్రీ లకు కొంచెం ఇటు అటుగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వాతవరణంలో మార్పుల వల్ల కూడా సంభవిస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం లేదా తగ్గడం వల్ల పలు ఆరోగ్య సమ స్యలు ఎదుర్కొవలసి వస్తుం ది.కనుక శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచు కోవాలి.
బాడీ హీట్ తగ్గాలంటే ...
ఇది స్ట్రెస్‌కు కారణం కావచ్చు. ఇది దానంతట అది తగ్గదు. ఎందుకంటే శరీరంలో అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉదా: అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. వేడి కలిగించే ఆహారం తీసుకోవడం వల్ల, నీరు అతి తక్కువగా తాగడం వల్ల బాడీ హీట్‌కు కారణాలు. కాబట్టి శరీరాన్ని తేమగా ఉంచుకోవడం చాలా అవసరం. అధికంగా నీరు తాగడం, శరీరంలోని టాక్సిన్ మలినాలు విషాలను తొలగించండి. శరీరాన్ని చల్లగా వుంచు తుంది. హెల్త్ మరియు కూలింగ్ ఫుడ్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ శరీరంలో వేడి తగ్గించుకోవచ్చు.