మృదువుగా, అందంగా ఉండే పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అయితే పెదాలు తడిగా ఉండేందుకు అక్కడ నూనె గ్రంధులేవీ ఉండనం దువల్ల అవి తరచు పొడిగా మారుతుంటాయి. పెదాలను నాలుకతో తడిచేసుకోవడం చాలా మందిలో మనం గమనిస్తున్నదే. కాని అలా చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. చలికాలంలో చర్మం పొడిగా మారి చాలా చోట్ల పగుళ్లు ఏర్పడడం, చిట్లిపోవ డం జరుగుతుంది. పెదాలు చిట్లిపోయి రక్తం కూడా కారు తుంది. పెదాలు చిట్లిపోవడానికి చాలా కారణాలు ఉం టాయి. విటమిన్ల లోపం, శరీరంలో నీటి నిల్వలు తగ్గిపో వడం, వాతావరణ మార్పులు ఇందులో ముఖ్యమైనవి.
చలికాలంలో పెదాల సంరక్షణకు తీసుకోవలసిన సూచనలు ఇవి: పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడిచేసుకోవద్దు. అలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమన ఉంటుంది. కాని తడి ఆరిన తర్వాత నొప్పి అధికం అవుతుంది.బాగా నీరు తాగాలి. కనీసం రోజుకు పది గ్లాసుల నీరు తాగాలి.,చవకరకం లిప్‌స్టిక్స్ వాడవద్దు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్ ఇ ఆయింట్ మెంట్ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి.,కలబంద రసాన్ని పూయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది., కీరా ముక్కను పెదాలపై రాయడం వల్ల పెదాలు మృదువుగా ఉంటాయి.,రాత్రుళ్లు పడుకునే ముందు పెదాలపై పేరుకుని ఉన్న నెయ్యి రాయడం వల్ల ఉదయానికి పెదాలు మృదువుగా, మెరుస్తూ కనపడతాయి. ఆలివ్ ఆయిల్‌ను రాయడం వల్ల కూడా పెదాల పగుళ్లు తగ్గుతాయి.