జిడ్డుచర్మం కలవారు తినాల్సిన , తినకూడని ఆహారాలు
యవ్వనంలో ఉండే చాలా మంది స్త్రీ, పురుషులు ఆయిల్ స్కిన్ తో బాధపడుతుంటారు.ఎక్కువగా, చర్మం క్రింద ఉండే తైల గ్రంథులు టీనేజ్ వయస్సులో ఉండే వారిలో చాలా ఎక్కువగా ఉండిమొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ సమస్యలకు దారితీస్తుంది. ఇది వయ్వనంలో ఉండే వారిలో సాధారణంగాకనిపించే ఒక సహజ సమస్య, ఈ సమస్యను నివారించడానికి ఆహారం చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. సరైన డైట్ను పాటించడం వల్ల ఆయిల్ స్కిన్ కు చెక్క పెట్టవచ్చు. మరియు ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల ఈఅనారోగ్యకరమైన డైట్ వల్ల చర్మ ఆయిలీగా మారుతుంది. కాబట్టి, మీరు ఆయిల్ స్కిన్ కలిగి ఉన్నట్లైతే,జిడ్డుచర్మంతో పోరాడగలిగే శక్తి ఆహారానికి మాత్రేమే ఉంది.
సరైన ఆహారానియమాలు పాటించి, ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా చర్మంలో జిడ్డుతత్వాన్నితగ్గించుకోవచ్చు. అలా కాకుండా మీరు ఫ్యాటింగ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అతి త్వరగా మీ ముఖంఫ్రైయింగ్ పాన్ లా కనబడుతుంది. నూనెగ్రంథులను తగ్గించుకోవడానికి జిడ్డు తత్వాన్ని నివారించడానికి డైట్ముఖ్య పాత్ర వహిస్తుంది. చాలా మందిలో జిడ్డుగల చర్మం కోసం తీసుకొని ఆహారాలు గురించి కొన్ని ప్రాథమికదురభిప్రాయాలున్నాయి. అన్ని ఆయిలీ ఫుడ్స్ మీ చర్మానికి తప్పనిసరిగా హాని కలిగించకపోవచ్చు.
ఆయిల్ ఫుడ్స్ లో కూడా కొన్ని మంచివి, మరికొన్ని చెడువి ఉన్నాయి. కొన్ని రకాల ఆయిల్ అంటేఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి చర్మానికి చాలా మంచిది. మరియు చర్మంలోని టాక్సిన్స్ శరీరం నుండిబయటకు నెట్టివేయబడుతాయి . అదే విధంగా కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు కూడా చర్మానికిమంచివి కావు. మీరు మీ చర్మ తత్వాన్ని బట్టి తెలివిగా ఎంపిక చేసుకోవడం అవసరం. ఆయిల్ స్కిన్ (జిడ్డుచర్మ తత్వం ఉన్నవారు కొన్ని తినాల్సిన మరియు కొన్ని తినకూడని ఆహారాలు క్రిందివిధంగా ఉన్నాయి...ఆయిల్ స్కిన్ నివారించే ఫుడ్స్: