HEALTHY TEETH CARE TIPS IN TELUGU
పళ్ళలో నొప్పి వస్తుందంటే మీరు వాటిని సరిగా రక్షించుకోవడంలేదు అనే అర్దం, అయితే కారణాలు ఏవైన అవి మన డాక్టర్ మాత్రమే చెప్పగలరు,నొప్పి వరకు తెచ్చుకుని నిద్ర లేని రాత్రుళ్ళు గడిపేకన్నా,పరుగు పరుగున డాక్టర్ వద్దకు పరుగెత్తేకన్నా, కొన్ని పద్దతులు పాటిస్తే మీ పళ్ళను రక్షించుకోవచ్చు, అవి ఏమిటంటే..
ప్రతీ రోజు ఆహారం తిన్న తరువాత కొంచెం గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించి వేయాలి.
ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునేముందు ఖచ్చితముగా పళ్ళను తోముకోవాలి(బ్రష్ చేసుకోవాలి).
ఏ దంతము అయితే మిమ్మల్ని బాదిస్తుందో, దాని వద్ద లవంగ మొగ్గ లేదా జాజి కాయ,ఉంచితే మంచి ప్రభావం చూపించడమే కాకుండా నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.
ఏ దంతమైతే ఎక్కువగా నొప్పి కలుగుతుందో దానిపై “ఐస్” ఉంచి మీ వేలితో రుద్దాలి.
బాగా భరించలేని నొప్పి కలిగితే ఒక “ఐస్” ముక్క తీసుకుని మీ నొప్పి కలిగించే పంటికి, మీ బుగ్గకీ మధ్య ఉంచుకోవాలి,అలాగే రోజుకి 3-4 సార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది.
ఎక్కువగా పాలు మరియూ ఆకు కూరలూ తీసుకోవడం మంచిది, ఎందుకంటే వీటిలో ” కాల్షియం” అదికంగా ఉండి మీ పంటికి బలాన్ని ఇస్తుంది.
తీపి,ఐస్ కీంలు,చల్లని పదార్దాలు ఇలాంటీ వాటికి దూరంగా ఉండడం అవసరం దీనివల్ల దంత క్షయం కలిగి, దంతాలకు హాని కలిగే ప్రమాదం ఉంది.
మీరు మీ పంటి నొప్పితో బాదపడుతున్న సమయంలో వేడి పదార్దాలను దూరంగా ఉంచండి, ఎందుకంటే ఈ సమయంలో అవి తీసుకుంటే మీ నొప్పి తగ్గడం కన్న ఇంకా అధికమయ్యే ప్రమాదం ఎక్కువ.