ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTH TIPS FOR USING KUMKUM FLOWER - KUMKUM PUVVU USAGE ADVANTAGES - TELUGU HEALTH TIPS FOR USING KUMKUM FLOWER IN DAILY LIFE


ఆరోగ్యానికి కుంకుమపువ్వు

కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భవతులైన స్ర్తీలు, ఆ తరువాత అందంలో దాని వినియోగం. కానీ కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు. మన పూర్వీకులు ఎప్పుడో ఔషధాల తయారీలో కుంకుమ పువ్వును వాడేవారని తెలుస్తోంది. దీన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో అప్పట్లో వారు వినియోగించేవారట. శాస్ర్తీయంగా కూడా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య శాస్త్రం కూడా చెబుతోంది.

కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ ఫ్రాన్‌ అంటారు. ఇది జాఫరాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్‌ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది.

కుంకుమ పువ్వు ఉపయోగాలు...

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది. కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు, జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు.

ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్‌ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను, డోపమైన్‌ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్‌ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్‌ దీనిలో వుంది కాబ ట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన.గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుందని వైద్యులు అంటున్నారు.