ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

HEALTHY ADVANTAGES OF PUMPKIN AND ITS SEEDS


గుమ్మడి గింజలు తింటే ....
జీవితకాలం పెరుగుతుందట!

మీలో ఉన్న అన్ని ఆరోగ్యసమస్యలను దూరం చేసే ఒక అద్భుత ఔషదం గుమ్మడి, గుమ్మడి గింజలు చాలా మంది. గుమ్మడి ఘుమఘుమలు లేని వంటిల్లు ఉంటుందా? గుమ్మడి పండు తగిలించిన తెలుగిల్లు ఉంటుందా?ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... గుమ్మడితో పోతాయి. ఇటువంటలకు అద్భుతమైన రుచి, అటు ఆనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడి కాయను కట్ చేసుకొని, గింజలను పారేస్తుంటారు. అయితే ఆ పారేవేసే గుమ్మడి గింజల్లోని వైద్యపరమైన ఔషధ గుణగణాలు తెలుసుకొన్నాక ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకంటే, ఈ అద్భుతమైన ప్రయోజనాలు చాలా మందికి తెలిసుండకపోవచ్చు.

గుమ్మడి మరియ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులోపుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యనాకి మేలు చేస్తుంది.

ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, మరియు క్యాన్సర్ వంటి జబ్బులతో బాధపడుతుంటారో అటువంటి వారికి, ఈ ఆరోగ్యకరమైన గుమ్మడి గింజలు బాగా సహాయపడుతాయి. వీటిని వారి యొక్క రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా అరోగ్యకరమే.

ఈ గింజల విషయంలో తప్పకుండా గుర్తుంచుకోదగ్గ మరో ముఖ్య విషయమేమిటంటే, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకానికి గురికావల్సి ఉంటుంది. కాబట్టి, గుమ్మడి గింజలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొనే వారు, ఎక్కువగా నీళ్ళు, పండ్ల రసాలు తీసుకోవాలి.