ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

om namah sivaya - lord siva's karthikamasam special articles in telugu


కార్తీకమాసం.. విష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదని చెప్తారు. సూర్యుడు తులారాశిలోకి రాగానే కార్తీకమాసం ఆరంభమవుతుంది. శివకేశవులకు కార్తీక మాసం ప్రీతిపాత్రమైనది. 

కార్తీకమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజామున నదీతీరంలో గాని, చెరువులు, కొలనులు, బావుల వద్ద స్నానం చేయాలి.

స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయనమః, ఓం ప్రభాకరాయమః, ఓం అచ్చుతాయనమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆత్గ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, పుణ్యఫలం చేకూరుతుందని విశ్వాసం.