ప్రమిదలలో రకములు - వాటి ఫలితములు
రాతి యుగం నుండి రాతిలో వెలిగించు,లోహతో వెలిగించు దీపాల వరకు, దీపాల అకృతులకును,
రాతి యుగం నుండి రాతిలో వెలిగించు,లోహతో వెలిగించు దీపాల వరకు, దీపాల అకృతులకును,
వాటిని తయ్యారు చెయ్యటానికి వాడే వస్తువునకు కుడా ఎంతో ప్రాముఖ్యత మరియు చరిత్ర ఉంది.
అందులో కళాత్మకతో ఒక క్రమ వికాసం కనిపిస్తుంది.
రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.అలాగే రకరకాల
రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.అలాగే రకరకాల
గుళ్ళల్లలోనూ కూడ దీపారాధన కు ఉపయోగించేవారు. ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి
వచ్చేను. మనుషులలో ఆర్ధిక,సామాజికంగా వచ్చిన మార్పుల బట్టి దీపాకృతుల్లోను వాటి
పరిమాణంలోను కళత్మకతలోను మార్పులు వచ్చేసాయి.
ఉదాహరణకు ఆర్ధికంగా ఉన్నవారు స్వర్ణదీపాలు,నవరత్నములు పొదిగిన దీపాల సెమ్మెలు వాడుకలో
ఉన్నట్లు, మన ప్రాచీన ఇతిహాసాలలోను కావ్యాలలో ప్రస్తావనలున్నాయి.
అలాగ పూర్వము శిల్పులూ, చిత్రకారులు దీప ప్రతిమలను మలచుటలో తమ తమ ప్రతిభలను,
పనితనాన్ని ప్రదర్సించేవారు. వీటికి నిదర్సనం ఇప్పుడు మన ప్రాచీన దేవాలయాలలో కనిపిస్తుంది. దీప
సుందరి ప్రతిమలను నృత్యముద్రలతో నిలబడిన సుందరీ నారిమణులు రంగు రంగుల రూపాలలో దీప
నిర్మాణంలో రూపకల్పనగా నగుపింతురు. అలాగే వివిధ రకాల పక్షులు, జంతువుల ఆకృతిలో
దీపలను మలచడంలో కళాకారుల. శిల్పుల వైవిధ్యం ప్రదర్సింపబడ్డాయి. వీటిల్లో చాందిని
దీపాలు,జ్వాల తోరణ ద్వారాలుగనున్న శిల్పనైపుణ్యం దీపాల ప్రాధన్యత పొందాయి.
దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి.
దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి.
మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను "వ్యష్టి " దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి, ఆ
ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసంపద కలిగించేది ....అలాగే దేవాలయాలలో చేసే దీపారధనకు దేవతల
అనుగ్రహం కలుగుతుంది...విశే ష ఫలితాలు .
తులసి కోట వద్ద చేసే దీపారాధనని " బృందావన" దీపారాధన అంటారు.
దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను "అర్చనా" దీపాలు అంటారు.
నిత్య పూజలలో ఉపయోగించే చిరుదీపాలను నిరంజన దీపాలంటారు.
గర్భగుడిలో వెలిగించే దీపాన్ని "నందా" దీపము అని అంటారు.
లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో గుడిలో వెలిగించే దీపాన్ని "లక్ష్మి దీపం" అంటారు
.
దేవాలయ ప్రంగణములొనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా
దేవాలయ ప్రంగణములొనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా
"బలిదీపం" అని అంటారు.
ఆ సమీపాన ఉన్న ఎత్తూయిన స్థంబం పై వెలిగించిన దీపాన్ని "ఆకాశదీపం" అంటారు.
అలాగ పంచాయతన దేవాలయాలలో
దేవతలు..శివుడు,విష్ణువు,అంబిక,గణపతి,ఆదిత్యుడు(సూర్యుడు) లున్న ఒక్కొక్క దేవత దగ్గర
వెలిగించే దీపారధనకు వివిధ పేర్లు ఉన్నాయి. శైవరూపంలో నందిరూపంగా, నాగరూపంలో మేళవించిన
దీపాలు కనిపిస్తాయి.
విష్ణువు వద్ద దీపకృతులు :శంఖు,చక్ర,గద,పద్మ"రూపాలు కనిపిస్తాయి.
ఏక ముఖం- మధ్యమం, ద్విముఖం - కుటుంబ ఐక్యత, త్రిముఖం-ఉత్తమ సంతాన సౌభాగ్యం,
చతుర్ముఖం -పశుసంపద మరియు ధన సంపద, పంచముఖం సిరిసంపదుల వృద్ధి ఫలితములు
ఉండును.
అలాగే మట్టి, వెండి పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం.
వెండి కుందులు అగ్రస్థానం . పంచ లోహపు కుందులు ద్వితియ స్థనం.
దీపారాధన చేసే తప్పుడు తప్పనసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం. మట్టి ప్రమిదలో
దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద మరో ప్రమిద పెట్టాలి.
ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాలలో తప్పనసరిగ చెయ్యాలి. నిత్యం శుభఫలితాలను ఇస్తు,
దుష్ట శక్తులు నశిస్తాయి. ఆ ఇంటా అందరు క్షేమముగా ఉంటారు
దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః
దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః
దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః
దీపం పర బ్రహ్మ స్వరూపం. పరాయణత్వం కలిగిందై. పాప ప్రక్షాళన చేయును. మన ఇంట సిరులు
ఇచేది దీపజ్యోతియే !
అట్టి దీపదేవికి నమస్కరిస్తున్నాను.