ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BHARTIYA SCRIPTURES - INDIAN SCRIPTURES INFORMATION IN TELUGU



(13)
హరి ఓం.
న్యాయ దర్శనం గౌతమ మహర్షి చే రూపొందించబడిన న్యాయ విద్యా విభాగం.న్యాయ దర్శనం ఆస్తిక విభాగానికి చెందినది. గౌతముడు క్రి.పూ 5 వ శతాబ్ది కాలానికి చెందిన మహర్షి. అతనిని "అక్షపాద" అని కుడా అంటారు.

షడ్-ధర్శానాలన్ని విజ్ఞానానికి సమాన ప్రాదాన్యతను ఇచ్చాయి. అలాగే న్యాయశాస్త్రంలో విజ్ఞానానికి ఇచ్చిన ప్రాదాన్యతను ప్రమాణాలు అంటారు. ఈ న్యాయ విధానాన్ని న్యాయశాస్త్రం గాను, తర్కశాస్త్రం గాను వ్యవహరిస్తారు.

న్యాయ శాస్త్రంలో ముఖ్యంగా నాలుగు ప్రమాణాలు ఉంటాయి.
అవి :
1. ప్రత్యక్షము.
2. అనుమానము.
3. ఉపమానము.
4. శబ్ద గుణము.
తర్కమునకు చర్చకు ఇవి మూలములు.

న్యాయదర్శనం భగవద్ నామాన్ని అంగీకరిస్తుంది. ఆ భగవంతుడిని ఈశ్వరుడిగా సంభోదిస్తూ సమస్త సృష్టికి కారణంగా వ్యవహరిస్తుంది.

గౌతముని సృష్టి వివరణలో ఒక ముఖ్యమైన వాఖ్యం..
"ఈ సమస్త విశ్వం 'శక్తి స్వరూపం'లోని ఈశ్వరునిచే నిర్మించబడి, ఆయననుంచే అణువులు, కాలము , ఆలోచన, అంతరిక్షము, జీవ రాశి సృష్టించబడ్డాయి"

న్యాయ దర్శనమును "తర్క శాస్త్రము" అని కూడా అంటారు.
కాని ఇది పూర్తిగా తర్క శాస్త్రం కాదు. ఇందులో మొత్తము 524 సూత్రాలుంటాయి.
గౌతముని న్యాయ సూత్రాలు ఇలా ప్రారంభం అవుతాయి.

ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన
దృష్టాంత సిద్ధాంతావయవ తర్క నిర్ణయ
వాద జల్ప వితండాహేత్వాభాసచ్ఛల
జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానా
న్నిఃశ్రేయ సాధిగమః

1. ప్రమాణములు
న్యాయ దర్శనం పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది. అవి:
ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి మరియు నిగ్రహ స్థానం.
ఈ పైన సూచించిన (షోడశపదార్థములు) ప్రమాణములు జ్ఞాన సాధనములు.

2. ప్రమేయములు
ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, (జ్ఞానము), మనస్సు, ప్రవృత్తి, దోషము, ప్రేత్య భావము, ఫలము, దుఃఖము మరియు అపవర్గము.