ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FRUIT JUICES GIVES 100% RELIEF FROM THROAT INFECTIONS AND OTHER PROBLEMS IN OUR HUMAN BODY - TAKE FRUIT JUICES REGULARLY FOR HEALTHY GROWTHY



జ్యూసులతో జలుబు, గొంతు నొప్పి మటు మాయం

గొంతు నొప్పి నివారణకు మీరు తీసుకోవల్సిన ఒక బెస్ట్ జ్యూస్ నిమ్మజ్యూస్. గోరువెచ్చని నిమ్మ జ్యూస్ మీ గొంతునొప్పిని మరింత బెట్టర్ గా చేస్తుంది మరియు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

ప్రస్తుతం శీతాకలం చాలా చలిగా, బలమైన గాలులతో ఇటు చర్మఆరోగ్యం, మరియు అటు శరీర ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేసే సీజన్ ఇది. వాతావరణంలో మార్పులతో పాటు, శీతాకాలంలో వచ్చే సాధరాణ జబ్బులైన జలుబు దగ్గు, మరియు గొంతునిప్పి వంటి అనేక ఇన్ఫెక్షన్లు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష న్‌ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి (త్రోట్‌ పెయిన్‌) మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు జలుబు, గొంతు నొప్పితో బాధపడుతుంటారో, తర్వాత వెంటనే బాధించేది, జ్వరం. ఇలాంటి అసౌకర్యాన్ని, జబ్బులను నివారించడం కోసం మీరు చికిత్స తీసుకొని, జలుబు మరియు దగ్గును నివారించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. జ్వరం త్వరగా తగ్గినా, జలుబు మరియు గొంతునొప్పి అంత సులభంగా, త్వరగా తగ్గక, వారాల తరబడి, మిమ్మల్ని బాధిస్తుంటాయి. చికిత్సతో పాటు కొన్ని హోం రెమెడీస్ ను మీరు అనుసరించినట్లైతే మీరు గొంతు ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా బయటపడవచ్చు.

థ్రోట్ ఇన్ఫెక్షన్(గొంతునొప్పి)కి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే పరిస్థితి తీవ్రం అవుతుంది. కాబట్టి, పరిస్థితిని తీవ్రతరం చేసుకోవడం కంటే, అది రాకుండా నివారించడమే మేలు. అందుకు కోసం గొంతు నొప్పిని నివారించడం కోసం బోల్డ్ స్కై కొన్ని జ్యూసులను మీకు పరిచయం చేస్తోంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్యూసులను తీసుకోవడం వల్ల, పరిస్థితి మరింత తీవ్రతరం చేస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ అది వాస్తవం కాదు, ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని నేచురల్ జ్యూసులను మీరు త్రాగడం వల్ల మీ గొంతునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు.

జలుబు, గొంతనొప్పి ఉన్నప్పుడు దానికి తోడు జ్వరకూడా వచ్చి చేరకుండా ఉండాలంటే, ముందుగా జలుబు, గొంతినొప్పిని నివారించుకోవాలి. అందుకోసం కొన్ని ఉత్తమ ఇంటి చిట్కాలున్నాయి. ఈ ఉత్తమ ఇంటి చిట్కాల్లో నేచురల్ జ్యూసులు చాలా గొప్పవి,

గొంతునొప్పితో బాధపడుతున్నవారికి మూడు రోజుల్లో ఈ నేచురల్ జ్యూసులు ఉపశమనం కలిగిస్తాయి. అందుకు మీరు గుర్తుంచోవల్సిన మరో ముఖ్య విషయం ఈ జ్యూసులకు చల్లటి నీరు, చల్లటి పాలు లేదా ఐస్ క్యూబ్స్ వంటివి కలుపుకోకుండా, సహజంగానే తయారుచేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.