శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. మనం రోజూ తినే ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేటట్లు చూసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. పెరుగుతున్న వయసుతో పాటు దానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి.విటమిన్లు, మినరల్స్, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.