ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

IMPORTANCE OF INDIAN MARRIAGE TRADITION AND CULTURE



ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!!

అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు...

మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల వరకు వెళుతున్నారు...!

నాలుగు గోడల మధ్య ఉండవలసిన భార్యా భర్తల తగాదాలను సర్ది చెప్పే పెద్దవారితో కాకుండా, అహంకారం కోసం ఆదిపత్యం కోసం ఆజ్యం పోసే వారితో పంచుకొని,
వారి సలహలు స్వీకరించి తమ జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవడంతో పాటు,
మనతోపాటే జీవితం అనుకున్న వారిని దుఖః సాగరంలో ముంచుతున్నారు...

ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని చూపించవు,
అలాగే 100% ఒకే అభిప్రాయాలున్న మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరి మద్య బేధాలు సహజం..
కాని వాటిని సర్దుకొని పోవడంలోను,
ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోను,
అభిప్రాయాలను, భావాలను మరొకరు గౌరవించుకోవడంలోనే ఆనందంకరమైన జీవితం ఉంది..

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు...
కాబట్టి ఒకరు మూర్ఖంగానో కోపంగానో ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండగలిగితే చాలు భార్యా భర్తల జీలితం సజావుగా సాగుతుంది.