అష్టొత్తర శతం (108) , అష్టొత్తర సహస్రం (1008) అంటారు అని అంటారు.
ఈ సంఖ్యలకు ప్రాధాన్యం ఏమిటి ?
ఇవి పరిపూర్ణతని తెలియ చేసే సంఖ్యలు.
1-ఏకం అద్వితీయం బ్రహ్మ - ఒక్కడే అయిన పరబ్రహ్మను సూచిస్తుంది.
'0' లేదా '0 0' మిధ్యాత్మకమైన జగత్తును సూచిస్తుంది. 'పంచభూతాలు ,మనోబుద్ధి అహంకారాలు ' కలిస్తే ప్రకృతి .
"భూమి రాపోనలో వాయుః ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా "అని గీత లో చెప్పారు.
పరబ్రహ్మ - జగత్తు - ప్రకృతి - వీటిని సూచించే సంఖ్యలివి అని శాస్త్రకారులు వివరించారు.
"విశ్వం శతం సహస్రం సర్వం అక్షయ వాచకం " అని మహాభారత వచనం శతం ( నూరు) , సహస్రం ( వెయ్యి) , సర్వ - ఇవన్నీ అనంతతత్వాన్ని సూచిస్తాయి. పరమాత్ముడు అనంతుడు. ఆయన లీలలు ,మహిమలు, గుణాలు అనంతాలు . వాటిని పేర్కొనగలిగే అనంత తత్వ శక్తి మనకి లేదు,కాని అనంతతత్వాన్ని సూచించే సంఖ్యలతో చేసే నామపారయణాదుల వల్ల మన బుద్ధిని అనంత తత్వంతో అనుసంధానం చెయ్యగలుగుతాము.
అందుకే శతం, సహస్రం - అనుష్టానం లో ప్రధానమయ్యయి, అయితే '8' సంఖ్యను కలిపి - మొత్తంగా 108, లేదా 1008 - చేస్తే , వీటిని కలిపితే '9' వస్తుంది. ఇది పూర్ణ శక్తి. అన్ని అంకెలు '9' లోనే ఉన్నాయి.
ఈ విధముగా 108/1008 పూర్ణత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి.