జుట్టు ఆరోగ్యంగా ఉండి, ఊడిపోకుం డానూ, వెంట్రుకలు నల్లగా నిగనిగలాడటానికీ, పేలు, చుండ్రు, పేనుకొరుకుడులాంటి అనారో గ్యాలు ఏర్పడకుండా జుట్టును పరిశుభ్రంగా ఉంచు కోవటమే కాకుండా, కేశాల అందం మెరుగు పడేలా సరయిన పోషణ, రక్షణ ఉండాలి. జుట్టు ఒత్తుగా ఉంటే, ఏరకమయిన హెయిర్‌స్లైల్ చేసు కున్నా అందంగానే ఉంటుంది. అయితే తమ జుట్టు ఏ రకమయినదో స్త్రీలు ముందుగా తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. జుట్టును మూడు రకాలుగా విభజించవచ్చు.
1. నార్మల్‌హెయిర్ 2. పొడిజుట్టు 3. జిడ్డు జుట్టు.
1. నార్మల్ హెయిర్ : నార్మల్ హెయిర్ ఉన్న వారు వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేయ వచ్చు. కొబ్బరినూనెను వెచ్చచేసి వెంట్రుకల కుదుళ్ళలోకి ఆయిల్ చేరేలా రాసుకోవాలి. సీకాయ, కుంకుడుకాయలను తలస్నానానికి ఉపయో గించాలి. జుట్టు బిరుసుగా ఉంటే తలస్నానానికి ముందు తాజా మందార ఆకులను కానీ, మందార పువ్వులనుకానీ మెత్తగా నూరి, ఆ పేస్టును తలకు పట్టించుకుని, పదిహేను నిమిషాలయిన తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల బిరుసుతనం తగ్గి, కురులు మెత్తగా అవుతాయి. ఉసిరిక పొడిలో గోరువెచ్చని నీటిని కలిపి తలకుపట్టించి, ఓ అరగంట అయిన తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగానూ, మృదువుగానూ ఉంటాయి. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
2. పొడి జుట్టు : జుట్టు బిరుసుగానూ, పొడి గానూ ఉంటే ప్రతిరోజూ జుట్టుకు నూనె పట్టిం చాలి. వారానికి ఒకసారి గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయాలి. తాము తీసుకునే ఆహారంలో పాలు, నెయ్యి, వెన్న, గుడ్లులాంటివి చేర్చాలి. వారానికి ఒకసారి తలంటిస్నానం చేయాలి. సీకాయపొడి, కుంకుడురసం లేదా పొడిని వాడాలి. ప్రత్యేకంగా మందార పూలను మెత్తగానూరి, ఆ పేస్టును తలకు పట్టించాలి. కొంతసేపయిన తర్వాత తలస్నానం చేయాలి. వారానికి రెండు, మూడుసార్లు ఈ విధంగా చేయాలి. పోషకాహారలోపం ఏర్పడకుండా చూసుకోవాలి.
3. జిడ్డు జుట్టు : జిడ్డుజుట్టున్నవారు ఆహార పదార్థాల్లో నూనెను బాగా తగ్గించాలి. వారానికి రెండుసార్లు మాత్రమే వెంట్రుకలకు నూనెను పట్టించాలి. తలలో జిడ్డు ఎక్కువగా ఉంటే మొటిమలు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని దుమ్ము, ధూళి వెంట్రుకలకు అతుక్కుని జుట్టు అపరిశుభ్రంగా మారిపోతుంది. వెంట్రుకలు అపరిశుభ్రమయితే, జుట్టుకు సంబం ధించిన అనారోగ్యాలు కలుగుతాయి. పేలుపడ తాయి. చుండ్రు కూడా రావచ్చు.జిడ్డుజుట్టుఉన్నవారు వారినికి రెండుసార్లు తలస్నానం చేయాలి. నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి మిశ్ర మాన్ని తయారుచేసి దాన్ని తలకురాసి అరగంట తర్వాత కుంకుడురసం లేదా సీకాయపొడితో తల రుద్దుకోవాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రు కల జిడ్డు తొలగిపోయి తలశుభ్రంగా ఉంటుంది.
తలలో చుండ్రు ఏర్పడితే వెంట్రుకలు ఊడి పోవడం, తల దురదగా ఉండటం, తెల్లని పొట్టు రాలడంలాంటివి కలుగుతాయి. చుండ్రువల్ల మొటిమలు కూడా వస్తాయి. తలలో చుండ్రు ఏర్పడినప్పుడు తలకు నూనెను రాయకూడదు. వారానికి మూడుసార్లయినా తలస్నానం చేయాలి. తలలోంచి తెల్లని పొట్టు రాలుతూంటే, నిమ్మరసంలో కొబ్బరినూనెను కలిపి తలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత మృదువుగా మసాజ్ చేయాలి. గంట సేపయిన తర్వాత తలస్నానం చేయాలి. మెంతులు నానేసి మెత్తగా రుబ్బి, శీకాయపొడిలో కలిపి ఆ పేస్టుతో తలను రద్దుకుంటే తలలోంచి పొట్టు రాలటం, దురదలాంటి బాధలు తగ్గిపోతాయి.
తలలో పేలు పడినట్లయితే జుట్టు ఊడి పోతుంది. గోళ్ళతో గీకుతూండటంవల్ల వెంట్రుకలు తెగిపోవడం, కుదుళ్ళు బలహీనపడటం జరుగు తుంది. గోకడంవల్ల తలమీద చర్మం చిట్లి పేలు ఆ ప్రదేశంలో నెత్తురు త్రాగుతూ పుండ్లను ఏర్పరుస్తాయి. పేలు ఉన్నప్పుడు తలకు వేపనూనెతో మర్దనాచేసి, ఆ తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటలయిన తర్వాత తలస్నానం చేయాలి. కలరా ఉండలను మెత్తని పొడిచేసి, ఆ పొడిని తలకు పట్టించినట్లయితే, పేలు చచ్చి పోతాయి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
తలలో అనారోగ్యాలు ఏర్పడినప్పుడు వెంట్రు కల శుభ్రతను పాటించాలి. దువ్వెనలు, తలగడలు, తలగడ గలీబులు, తలతుడుచుకునే తువ్వాల విషయాల్లో పరిశుభ్రతను పాటించాలి. జుట్టుకు రసాయనికాలు కలిపే హేరాయిల్స్‌ను వాడేకంటే కొబ్బరినూనెను వాడటమే మంచిది.