ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TIPS FOR PARENTS TO THEIR CHILDREN ON GOING BACK TO SCHOOL AFTER ENJOYING HOLIDAYS



1. పిల్లలకు స్కూలంటే భయపడే విషయాలు చెప్పవద్దు. టీచర్స్‌ అంటే వణికిపోయే మాటలు అస్సలు చెప్పవద్దు. 

2. పిల్లలకు బ్యాగ్‌లో తినడానికి ఏవైనా బాక్సులలో పెట్టడం మరిచి పోవద్దు. ఎందుకంటే ఇప్పటివరకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఒకటి తింటుంటారు. కాబట్టి ఆ బెంగ ముందర పోగొట్టాలి. అలాగే వాటర్‌బ్యాగ్‌, కర్చీఫ్‌ మరిచిపోకూడదు. 

3. స్వయంగా మీరే వారిని తీసుకెళ్ళి స్కూల్‌ దగ్గర వదలడం, తేవడం చేస్తుండాలి. స్కూల్‌ వదలడానికి పావుగంట ముందే మీరు అక్కడ ఉండేలా చూసుకోండి. లేకపోతే మీ పిల్లలు ఏడ్చి మరునాటి నుంచి స్కూలుకి వెళ్ళనని మారాం చేయవచ్చు. 

4. కే.జీ. పిల్లలను సాయంత్రంపూట దగ్గర్లో ఉన్న పార్కులకు తీసుకెళ్ళి ఆడించవచ్చు, అలాగే కాస్త పెద్ద క్లాసులో చదివే పిల్లలైతే రిలాక్స్‌ కోసం స్కేటింగ్‌, వీణ, వయోలిన్‌ లాంటి కోర్సులలో ఒక గంట శిక్షణ ఇప్పిస్తే అటు చదువుతోపాటు ఇటు ఆటల్లో రాణిస్తారు. 

5. ఇంటికెళ్ళాక పుస్తకాలన్ని తెచ్చారాలేదా అని పిల్లల్ని చెప్పమనండి. ఏం హౌంవర్క్‌ ఇచ్చారో డైరీతీసి చెప్పమనండి, వర్క్‌ తమ స్వంతంగా చేయమనండి, అప్పుడు మీరు ఇంట్లోలేనప్పుడు వారే స్వయంగా చేసుకోగలుగు తారు. 

6. పిల్లలకు చిన్నచిన్న మాటల్ని, పాటల్ని రాయడం, పాడడం, జి.కె.ఆన్సర్లు రాసేలా ప్రోత్సహించండి. అలా పోటీలకు పంపండి. వారికొచ్చిన బహుమతుల్ని స్కూల్లో చూప మనండి. అప్పుడు చదువు ఈ విధంగా ఉంటుందని అందుకు తప్పని సరిగా చదువుకోవాలని చెప్పండి. 

7. ఇంట్లో కంప్యూటర్‌ ఉన్న పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఛాటింగ్‌ చేయ మనక వారితో చిన్నచిన్న లెటర్స్‌, వారి నోట్స్‌ అందులో టైప్‌ చేయమనండి అవి ప్రింటింగ్‌ గీసి మీ పిల్లలకు చూపడం, వారూ చేయగలరని తెలపండి. ఈ విధంగా కంప్యూటర్‌ అంటే ఇంట్రస్ట్‌ కలిగేలా చేయండి. 

8. ఇది సెల్‌ఫోన్స్‌ కాలం, కానీ పిల్లలకు మరీ చిన్న వయస్సు నుంచే అలవాటు చేయకండి. అందులో ఉన్న ఆప్షన్స్‌ తెలియచేయండి, వాటిని ఆపరేట్‌ చేసేలా ప్రోత్సహించండి. కానీ స్కూల్స్‌కి పట్టుకెళ్ళనివ్వవద్దు, కొంతమంది పెద్దలు తమ అమాయకత్వంతో పిల్లలకు అడగంగానే సెల్స్‌ ఇవ్వడం మనం అక్కడక్కడా చూస్తుంటాం, అది మంచి పద్దతికాదు. 

9. ఎప్పుడైనా పుస్తకాలకి అట్టలు చినిగిపోతే వాటిని వారే కవర్‌ చేసేలా నేర్పించండి. అలా నేర్పేటప్పుడు బలవంతంగా ''ఇలా, అలా వేయాలి, వేసుకోవడం చేతకాదు'' అని కాక ఒకవేళ ఇంట్లో మేం లేనప్పుడు నువ్వే వేసుకోవాలి కదా నాన్న'' అంటే అది తప్పనిసరిగా పిల్లలు నేర్చుకుంటారు. 

10. మీరు బయటకెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. బ్యాంకులకు వెళ్ళేటప్పుడు డబ్బులు వేసే ఫారం ఎలా నింపాలి, ఎలా డ్రా చేయాలి, డి.డి.ఫారాలు ఎలా నింపాలి, ఇలాంటివి నేర్పితే ఇంకా మంచిది. 

11. పిల్లల్ని సం||రానికో స్కూలు మార్చే బదులు చదు వంతా అయ్యే వరకూ ఒకే స్కూల్లో ఉంచితేనే మంచిది. ఎందుకంటే ఎప్పుడూ కొత్తకొత్త స్కూల్స్‌ అయితే అలవాటు పడేసరికి సగం సమయం అయిపోతుంది, ఇతరులను ఫ్రెండ్స్‌ చేసుకోవడం ఆలస్య మవుతుంది. అందుకే ఒకే స్కూల్‌ అయితేనే బావుంటుంది. 

12. బజారుకి వెళ్ళేటప్పుడు మీ పిల్లలకు లేని పుస్తకాలని, కావల్సిన ఆట వస్తువులని వారి చేతే కొనేలా చేయండి. వాటి మీద ధరల్ని చూడమనండి, అలాగే తినే వస్తువుల్ని, మందుల్ని కొనేటప్పుడు వాటి మీద మాన్యుఫ్యాక్చరింగ్‌ డేట్‌, ఎక్స్‌పైరీ డేట్‌ గురించి వివరించండి. 

13. స్కూల్స్‌లోపోటీలు, బయటి పోటీలకు పంపండి, అలా బయట ప్రోగ్రామ్స్‌ చేసేటప్పుడు ఫోటో సెషన్స్‌ ఉంటాయి కాబట్టి పిల్లలకు స్టేజ్‌ మ్యానర్స్‌, పక్కవాళ్ళతో ఎలా మాట్లాడాలో చక్కగా నేర్పండి, అలాగే డ్రస్‌కోడ్‌ విషయం నేర్పడం మరీ అవసరం.

ఇంట్లో పెద్దవారికి సహాయం చేయడం నేర్పండి. వృద్ధులు ఉన్నట్లయితే మందులు, మంచినీళ్ళు అందించడం వంటి పనులు వారిని చిన్న చిన్న పనులు చేసేలా ప్రోత్సహించండి. ఇలాంటివి నేర్పించడం వల్ల చదువు పూర్తయ్యేసరికి పిల్లలు మంచివ్యక్తిత్వం కలవారుగా తయారవుతారు.