ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHAT IS GLOBAR WARMING AND EL NINO - BRIEF ARTICLE ABOUT EL NINO IN TELUGU


ఎల్ నినో అంటే ఏమిటి???
ఈ మధ్య తరచుగా మనం ఎల్ నినో అనే పదం.. భూతాపం అనే పదాలను వింటూ ఉన్నాం... అవి ఏమిటో చూడండి!!!
అసలు ఈ భూతాపం(global warming) అంటే ఏంటి?భూమి ఎందుకు వేడెక్కుతోంది?దాని పర్యవసానాలు ఏంటి?
భూతాపం(global warming) వలన కలిగే అనర్ధాలు ఏమిటి?

కరుగుతున్నice caps ప్రపంచ జీవావరణవ్యవస్థను(ecology) అస్తవ్యస్తం చేస్తాయి.icebergs లో మంచినీరే ఉంటుంది.ఇవి కరిగి సముద్రంలో కలిసినప్పుడు సముద్రనీటిలో ఉన్నలవణత(salinity) తగ్గిపోతుంది.అంటే నీటిలో ఉప్పు శాతం తగ్గిపోతుంది.ఫలితంగా సముద్రపు నీటి ఉష్ణొగ్రత(temperature) పెరుగుతుంది.అంటే కడలి వేడెక్కుతోంది.

భూఉపరితలంలో 70శాతం సముద్రాలే కాని 95% జీవరాశి కి ఆవాసం .సముద్రాలు కర్బనాన్ని(carbon) ఒడిసిపట్టే అతి పెద్ద రిజర్వాయర్లు.గత 250 సంవత్సరాలుగా మానవులు విడుదల చేసిన carbon-di-oxide లో 3వ వంతును సముద్రాలే గ్రహించాయి.350 బిల్లియన్ టన్నుల(350 billion tonnes) తమలో దాచుకోని మనకు సాయం చేశాయి.1960లో అవి మన చర్యలవల్ల విడుదలైన 2.4 బిల్లియన్ టన్నుల carbon గ్రహించగా,2010 నాటికి 5 బిల్లియన్ టన్నుల carbon గ్రహించాయి.అటువంటి సాగరం ముప్పులో పడింది.

ప్రాణవాయువును(oxygen) జీవారాశికి అందించడంలో సాగరం కీలక పాత్ర పోషిస్తోంది.మనం పీల్చే ప్రాణవాయువులో 50% సముద్రాల చలువే.భూఉపరితలం(earth's crust/land)పై ఉష్ణొగ్రతలు(temperature) సముద్రం మీద ఆధరపడి ఉంటాయి.ఇంకా చెప్పాలంటే సముద్రాలే ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి(control's).సముద్రం వేడెక్కడం వలన ఉష్ణొగ్రత్లలో మార్పు వస్తుంది.ఇప్పటికే బాగా మార్పు వచ్చింది.భవిష్యత్తులో ఇంకా వస్తుందన్నది యదార్ధం.

సముద్రం వేడెక్కడం వలన వాటికి కర్బనాన్ని(carbon) దాచిఉంచుకొనే శక్తి తగ్గిపోతుంది.ఫలితంగా వాతావరణంలో ఉన్నcarbon-di-oxide కు తోడుగా వాటిలో దాగి ఉన్న carbon-di-oxide విడుదలవతుంది.అంటే భూతాపం ఇంకా పెరుగుతుంది.వాటిలో ఉన్న జీవరాశి చనిపోతుంది.వాటినుండి విడుదలయ్యే ప్రాణవాయువు తగ్గిపోతుంది.

ప్రపంచజనాభలో 50% అవాసం కొల్పోతారు.300 కోట్ల మంది జీవనోపాధి కోల్పోతారు.

భూతాపం కారణంగా వచ్చే 100 ఏళ్ళలో సరాసరిన 9-88 సెంటిమీటర్ల(centi meters) మేర సముద్రమట్టాలు(sea-levels)పెరుగుతాయి.ఫలితంగా తీరప్రాంతాల ముంపు ,మడ అడవులు చిత్తడినేలలు కనుమరుగవుతాయి.తీరప్రాంతాలు(coastal areas) కోతకు గురవుతాయి.ఉప్పునీరు వచ్చి మంచినీటిని,వ్యవసాయాన్ని(agriculture) దెబ్బతీస్తుంది.వ్యవసాయం దెబ్బతింటే కరువు వచ్చి జనం ఆకలి చావులు చస్తారు.