ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DAILY EAT BADAM PAPPU / ALMOND TO AVOID HEART ATTACK CHANCES



రోజూ గుప్పెడు బాదంపప్పు తింటే గుండె జబ్బులు రావట!

గుండెజబ్బుల వల్ల మృతిచెందే వారి సంఖ్య అధికంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే గుండె జబ్బుల్ని ఎలా నివారించుకోవాలనే అంశంపై జరిపిన పరిశోధనలో మన హృదయాన్ని పదికాలాలు కాపాడుకోవాలంటే రోజు గుప్పెడు బాదం పప్పుల్ని తింటే సరిపోతుందని తెలియవచ్చింది. 

రోజూ గుప్పెడు బాదంపప్పు తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. బాదంపప్పులోని విటమిన్ ఇ, కొవ్వు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న ప్లేవనాయిడ్లు... రక్తప్రసరణను సాఫీగా ఉంచేలా చేస్తాయని పరిశోధనలో తేలింది.

దీని వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆస్టన్ వర్శిటీ ప్రొఫెసర్ హెలెన్ గ్రిఫిత్ తెలిపారు. ఈ అధ్యయనం కోసం... యువకులు, మధ్యవయస్కులు, వృద్ధులకు రోజు వారీ ఆహారంలో 50 గ్రాముల బాదంపప్పును ఉంచారు. దాంతో వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు.

  1. Almond

  2. The almond is a species of tree native to the Middle East and South Asia.
  3.  "Almond" is also the name of the edible and widely cultivated seed of this tree.