లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి.
మహాలక్ష్మి మనల్ని అనుగ్రహించాలంటే ఇలా చెయ్యాలి...
* సూర్యోదయానికి ముందుగానే లేవాలి.
* తొలుత ఇంటి వెనుక వైపు తలుపును తీసిన తర్వాతే సింహద్వారం తెరవాలి.
* మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి.
* ఇంటికొచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ ఇవ్వడం, తాగేందుకు నీరు ఇవ్వడం మరిచిపోకూడదు.
* పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మ పాపాలు నశిస్తాయి.
* పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసి సత్య నారాయణ స్వామిని లేదా విష్ణువును, వేంకటేశ్వరుని
* తులసితో అర్చించాలి. ఇది ఉదయపు పూజ కంటే మహా శక్తివంతం. పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో స్వామికి నివేదన చెయ్యాలి.
* వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం ఉంటేనే లభిస్తాయి. వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో వున్న వెండి పాత్రలను చివరికి సంతానానికి కూడా ఇవ్వకూడదని పెద్దల మాట.
* ఇవన్నీ చేసినా కొన్ని మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి, దుర్బుద్ధి విడనాడాలి. అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును అన్యాయంగా గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి ఉండదు.
* ఇంట్లో వెంట్రుకలు పడినా, చెత్త ఉన్నా, వాకిలి అపరిశుభ్రంగా ఉన్నా మహా లక్ష్మి ఆ ఇంటికి రాదు.
* బయటికి వెళ్లి వచ్చాకా కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. గుడినుంచి వస్తే మటుకు ఇందుకు మినహాయింపు. అపుడు నేరుగా పూజా మందిరానికి వెళ్లి దేవునికి నమస్కరించాలి.
* తల్లిదండ్రులను గౌరవించని వాడు, నిరాదరించే వాడు లక్ష్మీ కటాక్షానికి పాత్రుడు కాదు.
* దైవ నింద, రుషి నింద చేసే వాడు, ధర్మాచరణ యందు విముఖుడు, గోళ్లు కొరికేవాడు, లేకి మాటలాడు వాడు, దానం పట్ల అయిష్టత కలిగిన వాడు ఎన్నటికీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందజాలడు.