దాశరథీ శతకం -- రామదాసు
శ్రీయుత జానకీరమణ ! చిన్మయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతి చేసితి నామనంబునన్
బాయక కల్బిషవజ్రవిపాటన మదంగచేసి సత్కళా
దాయి పలంబు నాకీయవె ! దాశరధీ కరుణాపయోనిధీ !
భావము :
దశరధ పుత్రా దయా సాగరా సంపత్కరమైన లక్షణములు గల సీతకు భర్త యైనవాడా, జ్ఞానముతో గూడిన రూపము కలవాడా రామా! నారాయణ ! పాహి పాహి అనుచు నన్ను రక్షించమని కోరుచున్నాను. నా పాపములను తోలగించుము. ఎల్లప్పుడు నా మనసు నందే ఉండుము. మంచి ఫలములు నాకు ప్రసాదింపుము.