ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

PARTICULARS OF ASTA DIKKULU - ASTA DIPPALAKULU - NAMES AND DETAILS OF EIGHT DIRECTIONS AND ITS IN-CHARGE


అష్ట దిక్కులు -అష్ట దిక్పాలకులు తెలుసుకుందాం :

అష్ట దిక్కులు- దిక్పాలకులు

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా

తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,

పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,

దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,

ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ .

అలాగే నాలుగు మూలలు. ఆ నై వా ఈ అనేది కొండ గుర్తు. ఆనై అంటే తమిళం లో ఏనుగు, వాయి అంటే నోరు. ఆనైవాయి అంటే ఏనుగు నోరు అన్నమాట. అలా మనం మూలలు వరసలో గుర్తుపెట్టుకో వచ్చు. తూర్పు నుండి లెక్కిస్తే

ఆగ్నేయం ,

నైరుతి,

వాయువ్యం,

ఈశాన్యం

ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...

దిక్కు - దేవత - భార్య - పట్టణం - ఆయుధం - వాహనం

తూర్పు - ఇంద్రుడు - శచి - అమరావతి - వజ్రాయుధం - ఐరావతం

ఆగ్నేయం - అగ్నిదేవుడు - స్వాహా - తేజోవతి - శక్తి - తగరు

దక్షిణం - యముడు - శ్యామల- సంయమని - పాశం - దున్నపోతు

నైరుతి - ని ర్రు తి - దీర్ఘా దేవి- కృష్ణ గమని - కుంతం - నరుడు

పశ్చిమం - వరుణుడు - కాళిక- శ్రద్ధావతి - దండం - మొసలి

వాయువ్యం - వాయువు -అంజన - గంధవతి - ద్వజం - - జింక

ఉత్తరం - కుబేరుడు - చిత్ర రేఖి - అలకాపురి - కత్తి- అశ్వం

ఈశాన్యం - ఈశానుడు - పార్వతి - కైలాసం - త్రిశూలం - నంది