ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SANSKRIT SLOKAS OF PRAYING GODDESS SRI MAHA LAKSHMI AND ITS MEANING IN TELUGU


లక్ష్మీ దేవి ఎక్కడెక్కడ ఉండేదీ చెప్పడానికి సంస్కృత భాషలో అనేక శ్లోకాలున్నాయి. 

యత్ర పుత్రో గురోః పూజాం దేవానాం చ తథా పితుః 
పత్నీ చ భర్తుః కురుతే తత్రా అలక్ష్మీ భయం కుతః 

ఏ ఇంట పుత్రులు తల్లిదండ్రులను, గురువులను, దేవతలను పూజిస్తూ ఉంటారో, భార్య భర్తను పూజిస్తూ ఉంటుందో అక్కడ అలక్ష్మీ భయం అనగా దారిద్ర్యానికి అవకాశం ఉండదు. అలాగే ...

పంక్తి భేదే పృథక్పాకే పాకభేదే తథాకృతే
నిత్యం చ గేహకలహే భవితా వసతి స్తవ

ఒకే పంక్తి లోని వారికి భేదంగా వడ్డించే చోట, వేరు వేరు పొయ్యిలు పెట్టి వండుకునే చోట, ఒకే ఇంట్లో ఎవరికి వారు తమకు తోచిన రకాలుగా వంటలు వండుకునే చోట, అసలే వండుకోని ఇంట, కుటుంబ కలహాలతో నిండి ఉన్న ఇంట పెద్దమ్మ కాపురం చేస్తుంది. చిన్నమ్మ అనగా లక్ష్మీ దేవి అటువంటి ఇళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది

విలువైన మాణిక్యాలలో జాతి ముత్యాలలో, పూలమాలలోనూ, వజ్రాలలో, మంచి గంధంలో, పాలలో, అందమైన చెట్లకొమ్మలలో, తొలకరి నీలిమేఘాలలో లక్ష్మీకళ తేజరిల్లుతుంటుంది. లక్ష్మీదేవిని మొట్ట మొదట వైకుంఠంలో శ్రీమన్నారాణుడు పూజించాడు. తరువాత లక్ష్మిని బ్రహ్మ పూజిం చాడు. పిమ్మట శంకరుడు భక్తితో ఆమెను పూజించాడు. విష్ణువు పాలసముద్రంలో కూడా ఒకసారి లక్ష్మిని పూజించాడట. స్వయంభువు మనువు, పలువురు రాజులు, ఋషులు, మునులు, ఉత్తమ గృహస్థులు లక్ష్మీదేవిని పూజించారు. పిమ్మట గంధర్వులు పాతాళంలోని నాగులు లక్ష్మీదేవిని కొలిచారు. బ్రహ్మ భాద్రపద శుక్లాష్టమినాడు లక్ష్మీదేవిని పూజించి కృతార్ధుడయ్యాడు.

ముల్లోకాల్లోని వారు లక్ష్మిని భాద్రపద శుక్లపక్షం నాడు పది హేను రోజులు పూజిస్తారు. చైత్ర భాద్రపద పుష్య మాసాలు మంగళవారాలలో లక్ష్మీదేవి కి మహోత్సవాలు జరుపుతారు. ఏడాది చివర లో పుష్య సంక్రాంతి, మాఘ పూర్ణిమనాడు మంగళ కలశ మందావాహన చేసి మనువు మోక్షలక్ష్మిని పూజించాడు. సర్వమంగళ మాం గల్య రూపిణి అయిన లక్ష్మిని ఇంద్రుడు పూజించి అమితైశ్వర్య సంపన్నుడయ్యాడు. ముల్లోకాల్లో ఎందరెందరో మహాలక్ష్మిని కొలి చి కృతార్థులయ్యారు. లక్ష్మి సకలైశ్వర్యసంప దలకు ప్రతిరూపం అని నారదునికి నారాయ ణుడు లక్ష్మీ చరిత్రను తెలియజేశాడు.