మొటిమల నివారణకు అద్భుతమైన చిట్కాలు
సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారుచేసి రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతాయి.
ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు.
జాజికాయను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
నీరుల్లి గడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గుతాయి.
బియ్యం కడిగిన నీటిని మొటిమలపైన మృదువుగా రుద్దితే తగ్గుతాయి.
మొటిమ గనుక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన్న రసి అంతా వచ్చేస్తుంది.
బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.
పుదీనా ఆకులను ముఖాన పరచి ఉంచి పావుగంట తర్వాత తీసి చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను రుద్దనవసరం లేదు. అలా చేస్తే మొటిమలు మరింత నొప్పిచేస్తాయి.
కొంచెం నీటిలో దాల్చిన చేక్కపొడి వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది
మొటిమలు ఎక్కువగా ఉన్న వారు మాంసాహరం తగ్గించాలి.
మొటిమలు ఉన్నాయి కదా అని ఏక్రీం పడితే అవి రాసెయ్యకూడదు.దీనివల్ల మీ ముఖం ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
టమోటా పండు రసం తీసి మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
కొంచెం నిమ్మరసంలో వేపాకుపొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమలు నుండి విముక్తి పొందవచ్చు .
బొప్పాయి మొటిమల తాలూకు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది.బాగా మగ్గిన బొప్పాయి పండు గుజ్జులో రెండు చుక్కల తేనే , కొద్దిగా పాలమీగడ కలిపి ముఖానికి పూతలా వేయాలి . పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది