ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A TRIBUTE TO SRI TIRUPATHI VENKATA KAVULU


తిరుపతి వేంకటకవులు పద్యనాటకాల ద్వారా ప్రఖ్యాతి పొందారు

. పండిత రాజము, ఎడ్వర్డ్ పట్టాభిషేకము వంటి నాటకాలను రచించినా వారు భారతంలోని కథాంశాలను వస్తువులుగా చేసుకుని రాసిన పలు పద్యనాటకాలు ఊరూరా ప్రదర్శింపబడి విజయవంతమయ్యాయి

. పాండవ జననము, పాండవ ప్రవాసాము, పాండవరాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవ అశ్వమేధము అనే నాటకాలుగా రచించారు.

అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యోగం, పాండవ విజయం. ఆ రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెండు నాటకాలను సంకలనం చేసి 'కురుక్షేత్రము' అనే నాటకం గా ప్రదర్శించేవారు. పాండవ ఉద్యోగ విజయాలు, కురుక్షేత్రం నాటకాలు బాగా ప్రఖ్యాతి పొందాయి.

పాండవోద్యోగ విజయాలు నాటకాన్ని ప్రదర్శించని ఊరు కానీ, ఆలయం కానీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందిన అత్యంత అరుదైన నాటకాల కోవలోనివి ఇవి.

పాండవోద్యోగ విజయాలు నాటకం నుంచి కొన్ని పద్యాలు
చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు క
ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజ రాజ నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్.

జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణియున్ గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకల జెండుచున్నప్పుడొ
క్కండు న్నీమొరనాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్.

సంతోషంబుల సంధిచేయుదురె వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ
కాంతం జూచిననాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
పొంత న్నీ సహజన్ము రొమ్ము రుధిరమ్మున్ త్రావునాడైన ని
శ్చింతం దద్గదయుం ద్వదూరుయుగమున్ ఛేదించునా డేనియున్.