రోజుకో కప్పు పెరుగు తినండి.. కాస్తంత స్లిమ్‌గా ఉండండి!!
చాలా మంది యువతీ యువకులు ముఖ్యంగా యువతులు స్లిమ్‌గా ఉండేందుకు రకరకాల ఆహార నియమాలను పాటిస్తుంటారు. అధిక సంఖ్యలో డైట్ కంట్రోల్ చేసి తమ బరువును, బొజ్జను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే మీ బొజ్జ తగ్గి స్లిమ్‌గా ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు.
200 గ్రాముల పెరుగులో దాదాపు 300 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుందని పరిశోధనలో వెల్లడైనట్లు వారు తెలిపారు. క్యాల్షియం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్‌గా వుండడానికి దోహదపడుతుంది. మన శరీరానికి కావాల్సినంత క్యాల్షియం తీసుకోకుంటే శరీరంలో కొవ్వు శాతం బాగా పేరుకుపోతుంది. శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోయేది కడుపులోనేనన్నవిషయం తెలిసిందే.
అంతేకాకుండా పెరుగు లేప్టీన్ అనే హార్మోన్‌ను పెంపొందిస్తుంది. ఇది శరీరంలోని శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. పెరుగులోనున్న కాసిన్ని ప్రొటీన్లుకూడా భోజనం చేసామన్న తృప్తినిస్తుంది. పెరుగు తీసుకుంటే ఇతరత్రా చిరుతిండ్ల జోలికి పోరంటున్నారు పరిశోధకులు. చిరుతిండ్లు తీసుకుంటే అనాయాసంగా బొజ్జపెరిగి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి శరీరాకృతిని కాపాడుకోవాలనుకుంటే పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు పరిశోధకులు.
- Curd
- Curds are a dairy product obtained by curdling milk with rennet or any edible acidic substance such as lemon juice or vinegar, and then allowing it to set. The increased acidity causes the milk proteins to tangle into solid masses, or curds.Wikipedia
- Nutrition Facts
Calories 98 - % Daily Value*
*Per cent Daily Values are based on a 2,000 calorie diet. Your daily values may be higher or lower depending on your calorie needs.