హనుమాన్ చాలిసాను హింది అవధిబాషలో రచించినది శ్రీ గోస్వామి తులసీదాసు.
వీరు యమునా తీరంలో రాజపుర గ్రమాన క్రీ II శ్ II 15 వ శతాబ్దిలో (1497) విప్ర కుటుంబాన జన్మించారు తండ్రి ఆత్మారాం . తల్లి తండ్రులు రామభక్తులు కావడం చేత,కుమారుడు చిన్నతనంలోనే రామభక్తుడై నిరంతరం రామ నామ జపం చేస్తూ ఉండేవారు.అందుకే అతనికి "రాంబోలా" అనే నామం వచ్చింది.
తులసీదాసు వివాహితుడై ధర్మపత్ని రత్నావళీదేవి యెడ అమితమైన ప్రేమతో ఉండేవాడు. క్షణమైనా భార్యను విడిచి ఉండలేని తులసీదాసుకు ఒకసారి రత్నావళి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళడంతో దిగులు కలిగింది. అతడు వర్షాన్ని సైతం లెక్కించక,పొంగిన యమునా నదిని దాటి ,పామును తాడుగా బ్రహ్మించి , దాని సహాయంతో అత్తవారింటికి గోడను దుమికి,అర్ధరాత్రి భార్యను సమీపించాడు. ఆమే ఆశ్చర్యపడి " శల్యమాంసమయమైన ఈ దేహం పై మీకెంత మమత ఉందో,అందులో సగమైనా శ్రీ రామునిపై ఉంటే భవభీతి నశించేది" అన్నది.
దానితో ఆయన మనస్సు చివుక్కుమని, భక్తి ప్రపూరితమైన అతని మనస్సు పరిపాకం చెంది ఉండదంతో,వెంటనే ఆయనకు గాఢవిరక్తి కలిగి ఆయన జీవితంలో గొప్ప మార్పుకు నాంది ఏర్పడింది.
పధ్నాలుగు ఏళ్ళ తీర్థ యాత్ర చేసి నరహార్యానందులవారిని గురువుగా స్వీకరించి "తులసీదాసు" అయ్యాడు. శ్రీ హనుమంతుని అనుగ్రహంతో 1550 IIసంII లో శ్రీ రామ దర్శనం చేసుకున్నాడు, 1575 IIసంII శ్రీ రామ నవమి మంగళవారం "రామ చరిత మానసం " అనే రామాయణాన్ని ప్రారంభించి 2 IIసం II 7 మాసాల 26 రోజులలో పూర్తి చేసారు.
ఈ గ్రంధం భక్తి రసంతో కూడినది. రాముడు భగవంతుడనే అవతార తత్త్వముగా తెలిపే ఆధ్యాత్మ రామాయణాన్ని ఈయన అనుకరించడు. ప్రాంతీయమైన " అవధి" లో సామాన్యునికి కూడా అర్ధమయ్యేటట్లు రచించాడు. రామచరిత మానసాన్ని తెలియనివాడు,ముఖ్యంగా ఉత్తర హిందు దేశంలో ఉండరు . అదోక ధర్మ శాస్త్రం. దీనిని చదివి తరించారు. అవధి భాష అయోధ్యా పరిసరాలలో వాడే భాష. దీనిని అవధూతభాష అని కూడా అంటారు. శ్రీ తులసిదాసు గారిది "తుక్బంధీ" కవిత్వం. అనగ పాదములకు అంత్యనియమముంచాడు . అది శ్రవణ యోగ్యం.
శ్రీ తులసి దాసుగారు రచించిన గ్రంధాలు అనేకాలు. వాటిలో రామచరిత మానసం,వినయ పత్రిక , గీతావళి, హనుమాన్ బహుక్, హనుమాన్ చాలిసా మొదలైనవి ముఖ్యమైనవి. అనేక సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపస్సును ధారబోసి, మంత్రశక్తితో నిండి ఉన్నవి, ఆయన రచనలు. IIక్రిII శ్II 1623 II సం IIశ్రావణ శుద్ధ సప్తమి శనివారం రోజు శ్రీ తులసి దాసు గారు దాదాపు 120 సం బ్రతికి పరమపదించారు.