ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF HISTORY ABOUT GOLCONDA FORT - HYDERABAD - INDIA



గోల్కొండ కోట ప్రత్యేకతలు/సమాచారం క్లుప్తంగా మీ కోసం.

1. భారత్ లోని అద్భుత కోట సముదాయాలలో గోల్కొండ ఒకటిగా పేరు పొందింది.

2. దాదాపు 800 ఏండ్ల నాటి నిర్మాణం అయినప్పటికీ నేటికి కూడా హైదరాబాద్ యొక్క గొప్ప అద్భుత నిర్మాణాలలో ఇది ఒకటి గా చెప్పబడుతున్నది.

3. హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ ల దూరం లోని ఎత్తైన కొండ మీద గోల్కొండ కోట ఉంది.

4. ఈ కోటలో 87 బురుజులు, నాలుగు ప్రధాన సింహ ద్వారాలు, అనేక రాజమందిరాలు, కాకతీయులు గండ శిల తో నిర్మించిన దేవాలయాలు, ఆ తరువాత తురుక రాజులు నిర్మించిన మసీదులు కలవు.

5. ఈ కోటలో ధ్వని సంబదింత అత్యద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యం నిక్షిప్తం చెయ్యబడి ఉంది. కోట లోని ఒక ప్రదేశం వద్ద నుండి చప్పట్లు కొడితే కోట లోపల దాదాపు ఒక కిలోమీటర్ అవుతల ఉండే ‘బాలా మిస్సారు’ వద్ద ఈ శబ్దం చాలా చక్కగా వినపడుతుంది. శత్రువులు దాడి చేసే సందర్భాలలో హెచ్చరిక గా వినియోగించడం కోసం దీన్ని ఏర్పాటు చేసారు అని చెప్పుకుంటారు.

6. చప్పట్లు కొట్టే ప్రదేశం నుండి కోటలోనికి చేరుకోవడానికి 380 రాతిమెట్లు కలవు. కోటలోనికి నీటిని అప్పటిలోనే ప్రత్యేక విధానం ద్వారా పైకి చేరవేసేవారట. ఈ కోటలోనుండి నగరంలో ఉన్న చార్మినార్ కు గుర్రం పోయేటంత సొరంగమార్గం ఉందని ప్రచారంలో ఉంది.

7. ఈ కోటలోనే శ్రీరామదాసుగా పిలువబడే కంచర్లగోపన్నను భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు తానిషా కారాగారంలో బంధించాడు. ఈ కారాగారంలో రామదాసుచే గోడలపైన చెక్కబడిన సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను మనం ఇప్పటికీ చూడవచ్చు.

8. భావితరాలకు చరిత్ర ను చేరవేయ్యడం కోసం దీనిని పురావస్తుశాఖవారు తమ ఆధీనంలో పరిరక్షిస్తున్నారు.

9. కోటను చూడటానికి ప్రతిరోజు ఎంతోమంది సందర్శకులు దేశ విదేశాలనుండి వస్తారు. వారి కోసం అలనాటి కోట విశేషాలు తెలియచెప్పే సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటుచేయబడుతుంది. దీనిని తెలుగు,హిందీ,ఇంగ్లీషు భాషల్లో ప్రదర్శిస్తున్నారు.