కోవా కజ్జికాయలు
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - అరకిలో, పంచదార - కిలో, పాలకోవా -
పావుకిలో, జాపత్రి - 2 గ్రాములు, యాలకులు 2
గ్రాములు, శనగపిండి 50 గ్రాములు, వంట సోడా -
పావు స్పూను, బేకింగ్ పౌడర్ పావుస్పూను, నెయ్యి
100 గ్రాములు, రిఫైన్డ ఆయిల్ - తగినంత
తయారు చేసే పద్ధతి
ఇండియన్ స్వీట్లలో కోవా కజ్జికాయ విశిష్టమైంది.
కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపు ఉండరు.
కజ్జికాయ అనేక వెరైటీల్లో కోవా కజ్జికాయ రెసిపీ
ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ
తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో కోవా కలిపి
కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి,
యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా
చేయాలి. బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2
గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి
దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి
జల్లించాలి. అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి
నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి.
నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా,
కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని
పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి,
కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని
నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార
పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా
కజ్జికాయలు సిద్దం
ఉండ్రాళ్లు
కావలసిన పదార్థాలు:
బియ్యపు రవ్వ: 1 కప్పు నీళ్ళు: 1 -1/2
కప్పుల శనగపప్పు: 1/2 కప్పు జీలకర్ర: కొద్దిగా
నూనె :
తయారు చేసే పద్ధతి
1. ముందుగా మందపాటి గిన్నెలో నూనె వేసి వేడి అయిన
తర్వాత జీలకర్ర వేసి వేయించాలి. 2. అందులో నీరు పోసి
ఉప్పు వేసి, మరిగాక శనగపప్పు, బియ్యం రవ్వ వేసి
కలపాలి. 3. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద
ఉడికించాలి. దించే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన
తర్వాత కిందకు దింపి చెయ్యి
తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి.