ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

A TRIBUTE TO RISHI BHANKIM CHANDRA CHATOPADYAYA


దేశానికి గర్వకారణమైన జాతీయగేయాన్ని రచించిన అచంచల దేశభక్తుడు బంకించంద్ర ఛటర్జీ. 
ఈయన అసలుపేరు ‘రిషి బంకించంద్ర ఛటోపాధ్యాయ’.
బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం మొదలుకుని భారత స్వాతంత్ర్యోద్యమ
 చరిత్రలో దేశ ప్రజలను ఒక్కతాటిపై నిలిపిన మహత్తర గీతం వందేమాతరం.
భారత స్వాతంత్ర్య ఉద్యమకారుల చేతిలో పదునైన ఆయుధం ఈ గీతం. ప్రముఖ బెంగాలీ కవి, 
వ్యాస రచయిత మరియు సంపాదకుడు బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, 
అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.