ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT LORD SRI RAMA



రా జీవపత్రలోచన!
రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి
బ్రాజితపాదాంభోరుహ!
భూజనమందార! నిత్యపుణ్యవిచారా!
కలువరేకుల వంటి కన్నులు కల వాడా! మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాదపద్మాలు కల వాడా! భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా! మంచివారిని ఎల్లప్పుడు పాలించు వాడా! శ్రీరామా నమస్కారము.
ఇది ప్రథమ స్కంధాంత స్తోత్రం. కళ్ళు కలువరేకులవలె అందంగా ఉన్నాయి అంటే స్వామి చక్కటి అనుగ్రహాల్ని వర్షిస్తుంటావు అని. లోకంలోని మహారాజులు సైతం నీకు పాదాభివందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాలలోని మణుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతుంటుంది అంటే అంతటి శక్తిసామర్థ్యాలతో మమ్ము పాలిస్తావు అని. భూలోకులకు మందార అంటే ఆ మహారాజులు నుండి జనసామాన్యం వరకు అందరిని అజ్ఞానం తొలగించి కల్పవృక్షంలా అనుగ్రహిస్తావు అని. ఎప్పుడు పుణ్యాత్ముల క్షేమ సమాచారాలు చూస్తుంటావు అంటే పుణ్యులమైన మమ్ము పాలిస్తుంటావు అని.
1-528-ka.
raajeevapatralOchana!
raajaeMdra kireeTa ghaTita ratna mareechi
braajitapaadaaMbhOruha!
bhoojanamaMdaara! nityapuNyavichaaraa!
రాజీవ = తామర; పత్ర = రేకుల వంటి; లోచన = కన్నులు ఉన్న వాడా; రాజ = రాజులలో; ఇంద్ర = శ్రేష్టుల యొక్క – మహా రాజుల యొక్క; కిరీట = కిరీటములలో; ఘటిత = పొదగ బడిన; రత్న = రత్నముల యొక్క; మరీచి = కాంతి చేత; బ్రాజిత = ప్రకాశించుచున్న; పాద = పాదములు అను; అంభోరుహ = పద్మములు కల వాడా; భూ = భూమి పై; జన = జనించిన జీవులకు; మందార = కల్పవృక్షమా {మందార - కల్పవృక్షము వలె కోరికలు తీర్చు వాడు / మంద + ఆర = అజ్ఞాన ఛేధకుడు}; నిత్య = నిత్యమును; పుణ్య = పుణ్యాత్ముల గురించి; విచారా = ఆలోచించు వాడా – పాలించు వాడా.

శ్రీకర! పరిశోషిత ర
త్నాకర! కమనీయగుణగణాకర! కారు
ణ్యాకర! భీకరశర ధా
రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా!
శ్రీరామచంద్రప్రభు! సకల సంపదలను కలుగజేసేవాడ! సముద్రాన్ని ఇంకింప జేసిన మహాశక్తిశాలి! మనోహరమైన గుణగణాలకు నిలయమా! దయాసాగరా! భయంకర మైన బాణపరంపరలతో రాక్షసులను కంపింపజేసిన వాడ! నీకు వందనములు.
దశమస్కంధ ఉత్తరభాగం ఆరంభంలోని ప్రార్థన పద్యమిది.
10.2-1-ka.
Sreekara! pariSOshita ra
tnaakara! kamaneeyaguNagaNaakara! kaaru
Nyaakara! bheekaraSara dhaa
raakaMpitadaanavaeMdra! raamanaraeMdraa!
శ్రీకర = శ్రీరామ {శ్రీకరుడు - శ్రీ (సంపదలను) కరుడు (కలుగజేయు వాడు), రాముడు}; పరిశోషిత రత్నాకర = శ్రీరామ {పరిశోషిత రత్నాకరుడు - పరిశోషిత (ఇంకిపోవునట్లు చేసిన) రత్నాకరుడు (సముద్రుడు కలవాడు), రాముడు}; కమనీయ గుణగ ణాకర = శ్రీరామ {కమనీయగుణగణాకరుడు - కమనీయ (మనోజ్ఞములైన) గుణగణ (గుణముల సమూహము) లకు ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; కారుణ్యాకర = శ్రీరామ {కారు ణ్యాకరుడు - కారుణ్య (దయ)కి ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; భీకర శరధారాకంపిత దానవేంద్ర = శ్రీరామ {భీకరశరధారాకంపితదానవేంద్రుడు - భీకర (భయంకరమైన) శర (బాణముల) దారా (పరంపరలచే) కంపిత (వణికింపబడిన) దానవేంద్రుడు (రాక్షస ప్రభువులు కలవాడు), రాముడు}; రామనరేంద్రా = శ్రీరామ {రామనరేంద్రుడు - రాముడు అనెడి నరేంద్రుడు (రాజు), రాముడు}.