అవునురా గత వారం పెళ్లి చూపులని మీ ఊరెళ్ళావు కద . ఏమయ్యింది?”
“ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయి,” మెల్లగా అన్నాడు పాపారావు.
“గుడ్ న్యూసే చెప్పు. బ్యాడ్ న్యూస్ ఎలాగూ మామూలే కద,” అన్నాను నేను.
“వెరైటీగా ఉంటుందని ఈ సారి నేనే ముందు వెళ్ళాను. లోపల వెళ్ళగానే పెళ్ళి కూతురు ఎదురయ్యింది. తన ఫోటో చూశాగా. గుర్తు పట్టాలే. ఐతే తనే నా ఫోటో సరిగ్గా చూడనట్టుంది. ‘రండి మావయ్య గారూ రండి. మీరే ఇంత చార్మింగ్‌గా ఉన్నారంటే, మీ అబ్బాయి ఇంకెలా ఉంటాడో’ అంది,” చెప్పాడు పాపారావు.
“ఇది గుడ్ న్యూసా?” నోరు తెరిచాను నేను.
“కాదేటి? నేను అందంగా ఉన్నాను అని రికగ్నైజ్ చేసింది కద?” ఆనందంగా అన్నాడు పాప్స్ ఉరఫ్ పాపారావు.
“మరి బ్యాడ్ న్యూస్ ఏంటి?” అయోమయంగా అడిగాను నేను.
“నన్ను చూసి మా నాన్ననుకుంది. బ్యాడ్ న్యూస్ అంటూ వేరేగా చెప్పాలా?” కొర కొరా చూస్తూ అన్నాడు పాపారావు.