ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BHAGAWADHGEETHA - VISWAROOPAM - TELUGU BHAKTHI POEMS AND MEANING


శ్రిమద్భగవద్గీత -- విశ్వరూపసందర్శన యోగము 

పితాసి లోకశ్య చరాచరస్య త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్
న తత్సమోస్త్వభ్యధికః కుతోన్యోలోకత్రయే ప్యప్రతిమప్రభావ !

భావము:
ఓ అనుపమ ప్రభువా ! ఈ సమస్త చరాచర జగత్తుకు నీవే తండ్రివి. నీవు పూజుడవు, గురుడవు, సర్వశ్రేష్టుడవు. ఈ ముల్లోకములయందును నీతొ సమానమైనవాదేవ్వాడు లేదు. ఇంక నీకంటే అధికుడేట్లుండును. ?

తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యః ప్రియః ప్రియాయార్హసి దేవ షోడుమ్ !

భావము :
కనుక ఓ ప్రభో నాశరీరమును నీ పాదములకడ నిలిపి సాష్టాంగప్రణామము చేయుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుండవగుటకై ప్రార్ధించు చున్నాను. ఓ దేవ కుమారుని తండ్రి రక్షించు నటుల ఇత్రుని మిత్రుడు క్షమించు నటుల, భార్యను భర్త క్షమించునటుల, నా అపరాధమును నీవు క్షమింపుము.

అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్యా భయేన చ ప్రవ్యతితం మనో మే
తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస !

భావము :
మున్ను ఎన్నడునూ చూడని ఈ ఆశ్చర్య కరమైన రూపమును గాంచి మిక్కిలి సంతసించుచున్నాను. కానీ భయముచే నా మనస్సు కలవరపడుచున్నది. కనుక చతుర్భుజ యుక్తుడవై విష్ణు రూపముతొ నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ, జగన్నివాసా, ప్రసన్నుడవు కమ్ము.