సౌందర్యలహరి
విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా
మహాసంహారేzస్మిన్విహరతి సతి త్వత్పతిరసౌ ||
భావము
విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా
మహాసంహారేzస్మిన్విహరతి సతి త్వత్పతిరసౌ ||
భావము
తల్లీ ! జగజ్జననీ! మహాప్రళయం సంభవించిన సమయంలో బ్రహ్మ పంచభూతాలలో లయమవుతున్నాడు. మహావిష్ణువు నిర్లిప్తుడవుతున్నాడు. యముడూ వినాశనాన్ని పొందుతున్నాడు. కుబేరుడు కాల ధర్మం చెందుతున్నాడు. పదునల్గురు మనువులు, ఇంద్రులు కన్నుమూస్తున్నారు. కాని ఓ పతివ్రతా! ఆ సమయంలో కూడా నీ భర్త సదాశివుడు, నీ పాతివ్రత్య మాహాత్మ్యం వల్ల, విశృంఖలుడై స్వేఛ్ఛగా విహరిస్తున్నాడు.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
“భాస్కర ప్రియ” - (భాస్కరానందనాథ భావము)
భవానిని సన్నుతించ, ‘భాస్కర ప్రియ’ అను నామఁబున నే తెల్పేద నా
భావంబు, విభుద జనులు మెచ్చంగ, భక్తి తోడన్ భాస్కరా !
పై శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క పాతివ్రత్య మాహాత్మ్యం ను తెలియ జేస్తున్నారు