ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU PRAYER ABOUT LORD MAHA SIVA


బొజ్జ గణపతి తండ్రి జయమంగళం
స్కంద జనకా నీకు శుభ మంగళం
ఓ గౌరి మగడా జయ మంగళం
నాగేంద్ర ధరుడా శుభ మంగళం
లోకాల పాలకా జయమంగళం 
లక్ష్మీశ వినుతా శుభమంగళం
మంగళము మంగళము ముక్కంటి దేవా
మంగళము నీకయ్య నెలతాల్పు దేవా
కామాంతకా నీకు జయ మంగళం
కాలాంతకా నీకు శుభ మంగళం
నాట్య ప్రియుడా నీకు జయ మంగళం
పాప హరుడా నీకు శుభ మంగళం
అణువణువునా ఉండు సర్వాత్మ మంగళం
బ్రహ్మాండములు నిండు విశ్వాత్మ మంగళం
మంగళము మంగళము ముక్కంటి దేవా
మంగళము నీకయ్య నెలతాల్పు దేవా
బ్రహ్మతల ద్రుంచిన రుద్రునకు మంగళం
తలరాత మార్చగల శంభునకు మంగళం
మంగళము మంగళము ముక్కంటి దేవా
మంగళము నీకయ్య నెలతాల్పు దేవా