ప్రాణాయామం
ప్రాణాయామం (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
ప్రాణశక్తి ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు వ్యానం.
ముఖ్యమైన దశలు
1. పూరకం: ఊపిరితిత్తుల నిండా మెల్లగా గాలిని పీల్చడాన్ని పూరకమంటారు.
2. కుంభకం: పూరకం తర్వాత గాలిని లోపలే ఆపి ఉంచడం 'అంతఃకుంభకం' అవుతుంది. అలాగే రేచకం తర్వాత గాలిని లోపలికి పీల్చకుండా ఆపి ఉంచడం 'బాహ్యకుంభకం' అవుతుంది.
3. రేచకం: ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.
ప్రాణాయామ పద్ధతులు
ప్రాణాయామం ముఖ్యంగా ఎనిమిది రకాలు. ఇవి అష్టకుంభకాలు.
1. ఉజ్జాయి:
2. సూర్యభేద:
3. భస్త్రిక:
4. శీతలి:
5. సీత్కారి:
6. భ్రామరి:
7. మూర్ఛ:
8. ప్లావని:
మరింత సమాచారం
ప్రాణాయామము : ప్రాణము అనగా జీవనము , ఆయామము అనగా పొడిగించుట. ( పెంచుట ).
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక నందు మరియు పాతంజలి యొగశాస్త్రం నందు కూడ ప్రాణాయామం చెప్పబడెను.
8 రకముల ప్రాణాయామ పద్ధతులుకలవు :
సూర్య భేదనం ఉజ్జాయి శీతలి శీత్కారి భస్తిరిక భ్రామరి ప్లావని మూర్ఛ ఇతి అష్త కుమ్భకాని -
సూర్య భేదనం అనగా సూర్య నాడిని ఉద్ద్దీపన చేయుట. యడం ముక్కును మూసి కుడి ముక్కుతొ పదెపదె గాలిని పీల్చుట ( సూర్య భెదనము మరియు భస్త్రిక ప్రాణాయామాల వలన శరీరమందలి శీతల సంబంధిత రోగములు తొలగును. లొ.బి.పి. కి మంచిది.)
ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.ఆసమయములొ గొంతుక వద్ద ద్వని నెమ్మదిగ చేయవలెను. ( స్వరమునకు మంచిది.కపము తగ్గును.)
శీతలి అనగా చల్లదనము. నాలికను కాకి ముక్కు వలెనె చేసి గాలిని నాలిక ద్వారా పీల్ఛుకొనవలెను. పిదప ముక్కుతో వదలవలెను.
శీత్కారి అనగా చల్లదనము . గాలిని నొటిలొని పల్లమధ్యనుండి లొనికి పీలుచుకొనవలెను. ( శీతలి మరియు శీత్కారీ ప్రాణాయామాల వలన హ్హె.బి.పి. తగ్గును.చక్కగ నిద్రపట్టును.)
భస్త్రిక అనగ తొలుతిత్తి. గాలిని వెగముగ ముక్కుద్వారా తీసి వదులుట కమ్మరి వాని తొలుతిత్తి వలెనె చెయవలెను.
భ్రామరి అనగా తుమ్మెద . తుమ్మెద ద్వనివలెనె నాసాగృము ద్వారా గాలిని బయిటకు వదలవలెను. (బ్రామరి ప్రాణాయామ సాదన వలన మనస్సుకు శాంతి కలుగును.నిదుర పట్టును.)
ప్లావని అనగా తేలుట . పెదవులను కాకిముక్కు వలెనె చేసి గాలిని లోనికి పూర్తిగా పొట్ట నిండు వరకు పీలుచుకొనవలెను. (ఈ ప్రాణాయామము వలన వాయువులలొని త్రిదొషములు తొలగును.)
మూర్ఛ అనగా మతిభ్రమించుట. గాలిని ముక్కుద్వారా లొనికి తీసుకొని వదులునపుడు-
ఆగాలి మెదడుకు దిగువన గల పిట్య్టటరి గృందికి తకునట్లుగ ఉన్డవలెను.( దీనివలన మెదడుకు శాంతి కలుగును.)
పాతంజలి యొగములొ - శ్వాస ప్రశ్వాసొగతివిఛెదా ప్రాణ్ణాయామ అని చెప్పబడినది.
అనులొమ విలొమ ప్రాణాయామము ముఖ్యమగు ప్రాణాయామము.
ఎడమ నాసగ్రము ద్వారా గాలిని లొనికి తీసుకొని కుడి నాసాగ్రము ద్వారా గాలిని వదల వలెను.
పిదప గాలిని అదె కుడి నాసగ్రము ద్వారా తీసుకొని ఎడమ నాసాగ్రము నుండి వదల వలెను.ఈ ప్రకారముగా పలుమారులు సాదన చేయ వలెను. ( జీవించినంత కాలము ఈప్రాణాయామ సాదన చాల ఉపకరించును.సకల రొగములు తొలగును.)
ద్యానము చేయుసమయములొ నాసాగ్రమునందు ద్రుష్తిని నిలిపి గాలి గమనాగమనములను గమనించుటచె మనసు కుదుటపడి ఎకాగ్రత కలుగును.
దీనినె విపాసనాద్యానం అని కూడ అందురు.
ఈప్రాణ్ణాయామం గురించి స్వరశాస్త్రమంజరిలొ వివరముగ వివరించబడినది. స్వరమె పరమాత్మ అని కూడ పెద్దలు చెప్పెదరు.