నరక చతుర్దశి శుభాకాంక్షలు
ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. ఒక రాక్షసుణ్ణి మరణాన్ని ఆనందంగా పండుగ చేసుకోవడం – నరక చతుర్దశి విశిష్టత.నరకాసుర వధ – చతుర్దశి నాడు (ఆశ్వయుజ బహుళం) ఆకాశంలో రాసులస్తితిని సూచించేది. తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి. కనుక అతని పాలన అంధకారమయం! ఆ రోజు మేష రాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటే! మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దాన్ని అధిస్టించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు – సూర్యుడు, సత్యభామ-చంద్రుడు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయాల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విడివడి, తమను విడిపించిన సూర్యున్ని – కృష్ణున్ని నాయకునిగా చేసుకునింది. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు. నరక భావాలు అంటే దుర్భావాలను, కృష్ణభక్తి అనే చక్రాయుధంతో ఖండింప చేసి, జీవుడు భవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్ధం. నరాకాసురవధ స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనం.