శివసేవావశ్యకతా..!
శ్రీ గురుభ్యోనమః
నమస్తే
శ్లాఘ్యం జన్మ-శ్రుతిపరిణతిః సత్క్రియాయాం ప్రవృత్తిః
ఫ్రౌఢిః శాస్త్రే లలిత మధురా సంస్కృతా భారతీ చ!
స్ఫీతా లక్ష్మీర్వపు రపి దృఢం చంద్రరేఖాంకమౌళే
యుష్మత్సేవా పదవిరహితం సర్వ మేతత్పలాలమ్!!
చంద్ర రేఖ శిరమున కల శివా! ఉత్తమ వంశంలో జన్మించడం, వేదాధ్యయనం బాగా చేయడం, అందులో పరిపాకాన్నొందడం, ఉత్తమకర్మలననుష్టించడమునందు నిరంతర ప్రవృత్తి కలిగి ఉండడం వానిని అనుష్ఠిస్తూండడం, శాస్త్రములందు పాండిత్యం, సుకుమారము, సుందరమునైన వ్యాకరాణాది శాస్త్ర సంస్కారయుక్తమగు వాక్కులతో మాట్లాడగలగడం, గొప్పనైన సంపద కలిగి ఉండడం, గొప్పనైన శరీర ధారుఢ్యం కలిగి ఉండడం, ఇలాంటివెన్నున్నా ఓ శివా! నిన్ను సేవించడం అనే పదవి ఒక్కటి లేకపోతే, అవన్నీ సారరహితమైన తాలు ధాన్యంలాగా నిష్ఫలమే అవుతున్నవి.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వొంగ హరి కీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా తలుపడేని
కలుగనేటికి తల్లుల కడుపు చేటు.. అని పోతన గారు
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు..