సోంపల్లె (ములకలచెరువు)
సోంపాళేయములో చెన్నకేశవాలయం ఎదుట ఉన్న ఏకరాతి స్తంభం - 60 అడుగగుల ఎత్తు ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల క్రిందట చెక్కబడింది.
సోంపల్లె (సోంపాళ్యం), చిత్తూరు జిల్లా, ములకలచెరువు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 517 390.
ఈ ఊరు ములకల చెరువు నుండి 6 కి.మీ.. దూరంలో ములకల చెరువు - తంబళ్ళపల్లి రోడ్డు మధ్య ఉంది. ఇక్కడి చెన్నకేశవస్వామి మందిరం ఆంధ్రప్రదేశ్‌లోని ఎంతో అందమైన ఆలయాలలో ఒకటిగా చెబుతారు. శ్రీ మహావిష్ణువు, శ్రీ లక్ష్మీ సమేతంగా ఆవిర్భవించిన అతి పురాతన దివ్య క్షేత్రం ఇది. ఆలయం ఎదురుగా ఉన్న ఏకశిలా స్తంభం చక్కని శిలాకృతులతో విరాజిల్లుతుంది. ఆలయంలోని కళ్యాణమంటపంలోని శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. 16వ శతాబ్దంలో, విజయనగర రాజులకాలంలో కట్టబడిన ఈ ఆలయనిర్మాణానికి ఒక గొర్రెల కాఫరి మూలకారకుడని ఇక్కడి కథ.
గట్టుకింద పల్లి గ్రామము, సోంపల్లె (పోస్ట్), ములకల చెరువు(మండలం). ఈ కుగ్రామము, ములకల చెరువు నుంచి 7 కి.మి. దూరాన ఉన్నది. చుడటానికి ప్రశాంతంగా ఉన్నది.