ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

STORY OF DEEPAVALI FESTIVAL - WHY SHOULD WE HAVE TO PERFORM DEEPAVALI FESTIVAL - ARTICLE IN TELUGU - SCIENTIFIC SECRETS OF DIWALI FESTIVAL - PURANA STORY OF DIWALI FESTIVAL


మనం దీపావళి ఎందుకు చేసుకుంటున్నాం

హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి... ఇది మొత్తం నాలుగురోజుల పండుగ... మెదటి రోజు త్రయోదశి ని ధనత్రయోదశి పేరుతో, రెండవరోజు చతుర్దశిని నరక చతుర్దశి పేరుతో , మూడవరోజు అమావాస్యను దీపావళి పేరుతో, నాలుగవ రోజు పాడ్యమిని బలి పాడ్యమి పేరుతో జరుపుకుంటాము. అయితే వీటిలో ధన త్రయోదశిని గుజరాత్-ఉత్తరాది రాష్ట్రాలలో... బలి పాడ్యమి కేరళలో బాగా జరుపుకుంటారు.. ఈ రెండు పండుగల గురించి మన తెలుగు రాష్ట్రాల వారికి పెద్దగా తెలియదు... 

దీపావళి రోజులలో మనం వెలిగించే ఈ దీపాలు మన పూర్వీకులకు మార్గ దర్శకాలుగా నిలుస్తాయని.. ఒక నమ్మకం... మనకు జన్మనిచ్చి మనమున్న స్థితికి కారణమయిన మన పెద్దలకు సంవత్సరంలో ఒక రోజు దీపం పెట్టడం మన కర్తవ్యం... 

దీపావళి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు ఆ రోజు ఇల్లంతా దీపాలు పెట్టటం వలన లక్ష్మీ దేవికి ప్రీతి కలుగుతుంది... అందుకే దీపాలతో ఇంటిని అలంకరిస్తారు...
కాంతి అంటే జ్యేష్టా(దరిద్ర దేవత-లక్ష్మీ దేవి అక్క)దేవికి ఇష్టం ఉండదు.. అందుకే ఇంటిలో దేదీప్యమానంగా అలంకరించడం వలన ఒకేసారి లక్ష్మీదేవికి ఆహ్వానం... పెద్దమ్మకు వీడ్కోలు చెప్పినట్లవుతుంది...ఇంట్లో ఉన్న జ్యేష్టాదేవికి వీడ్కోలుగా మతాబులు కాలుస్తారు... పూర్వ కాలం ఢమఢమ ధ్వనులు చేసేవారట.. అదే క్రమంగా మతాబులు కాల్చే అలవాటుకు దారి తీసిందని ఒక కథనం... 

మన పూర్వీకులు ప్రతి పండుగ ఒక ఋతువు ప్రారంభంలో లేదా ముగింపులో వచ్చేవిధంగా ప్లాన్ చేసారు... ఇప్పుడు మనం కార్తీక మాసంలో అడుగు పెడుతున్నాం... శీతల వాయువులను కలిగి ఎక్కువ బ్యాక్టీరియా ఉన్న వాతావరణానికి ఈ మతాబుల నుండి వచ్చే పొగ దాదాపు దోమలను.. ఇతర క్రిమి కీటకాలను సంహరించేది.. మతాబుల కాల్పులకు ఇది కూడా ఒక కారణమని ఒక కథనం....

ఇక పురాణ వివరాలకు వస్తే...

ఈ రోజే శ్రీరాముల వారు రావణసంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మయ్యే (భరత్ మిలాప్) సందర్భం...

శ్రీకృష్ణుడు నరకాసురిని వధించిన రోజు...
వామనుడు... బలిచక్రవర్తిని పాతాళానికి అణచిన రోజు...
విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు
ఇన్ని విశేషాలున్నాయి కాబట్టి.. ఈ రోజు మనకు అత్యంత పవిత్రమైనది... ఈ రోజు ఇంట్లో దీపం పెట్టడం అత్యంత శ్రేయస్కరం... కనీసం ఒక్క మతాబు అయినా కాల్చటం.. మన దరిద్రానికి మనం చెప్పే వీడ్కోలు...
పైన తెలిపిన ఏ విషయాలు కూడా శాస్త్రీయ ఋజువులు-- ఆధారాలు చూపించనవసరం లేదు.... ఇష్టమైన వారు పాటించవచ్చు... కుహనా వాదుల విమర్శలతో పనిలేదు...
తక్కువ ఖర్చు పెట్టండి... చుట్టూ ఉన్న సమాజాన్ని ఆదరించండి... పండుగలూ జరుపుకోండి.. తప్పు లేదు... అనవసర ప్రచారాలను నమ్మి జీవితంలో వేటినీ కోల్పోకండి... కలర్ లెస్ హోళీ/విగ్రహాలు లేకుండా వినాయకచవితి/ మతాబులు లేకుండా దీపావళీ చేసుకోలేం...
మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు!