కూర్మావతారము
హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. ఆ అవతారాన్ని పోతన తన భాగవతంలో ఇలా వర్ణించాడు.
సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు
సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు
వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ
మంబుజంబుల బోలెడి యక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె.
అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.
జయదేవుని స్తోత్రంలో కూర్మావతార వర్ణన
క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే
ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే
కేశవ! ధృత కచ్ఛప రూప!
జయ జగదీశ హరే!
శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు
కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాల లో మూలాలు.
మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం (తాబేలు) అవతారం.
విష్ణు ప్రముఖ దశావతారాలలో 2 వ అవతారం.
విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది, రెండు ద్వజస్థంబాల తో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి.
రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలులో ఒకటి.
అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలు తో ఉన్న దేవాలయాలులో ఒకటి.
దుర్గా మాత వైష్ణోదేవి రూపం లో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం., ఇతర వైష్ణోదేవి ఆలయం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లో ఉంది.
దీని శిఖరం రాతి శిల్పం - గాంధార శిల్పకళా అని అంటారు., ఇతర స్థంభాలతో పోలిక లేకుండా కొన్ని స్థంభాలు క్రింద వృథాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్థంభాలు ఉన్నాయి.
వారణాసి (కాశి) వెల్లడానికి సొర్ంగ మార్గం ఉంది ,ప్రస్థుతం దీన్ని మూసివేసారు.
వారణాసి / పూరీ (ఒడిషా) ల వలె , మరణించినవారి అంతిమ కర్మలు ,మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు .
ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహా ప్రభు అనేక గొప్ప రాజులు మరియు సెయింట్స్ ఋషులు దేవాలయాన్ని సందర్శించారు
KOORMA AVATAR
Second incarnation of Lord Vishnu. As per legend Lord Vishnu took this Avathar to hold the mountain called Mandara, when Devas and Asuras churn the ocean to get Amirtham.
Once there was a war between Devas (gods) and the demons (Asuras), in that war Devas lost and the prayed to Lord Vishnu to save them from Demons. Lord Vishnu suggested for a truce, that was both sides should get together and churn the ocean. That truce was agreed by both sides.
The great mountain Mandara was used as a rod and Snake Vasuki was used as a rope to churn the ocean. All Devas holding the tail of Vasuki and Asuras holding head of the snake.
Both teams started churning but the mountain Mandara had no base so Lord Vishnu changed his form in to Tortoise and gave balanced to the mountain.