ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

CAPSICUM THE WONDER HEALTH MEDICINE


ఔషధాల గని క్యాప్సికం
***************** 
బెంగుళూరు మిర్చిగా పిలుచుకునే క్యాప్సికం ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల రంగులలో కూడా లభ్యమవుతున్నాయి. కాని రెగ్యులర్‌గా దొరికేవి మాత్రం ఆకుపచ్చవే. ఒకరోజుకు కావాల్సిన విటమిన్‌ సి ఒక్క క్యాప్సికంలోనే దొరుకుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఎన్నో గుణాలున్న క్యాప్సికం గురించి తెలుసుకుందాం. క్యాప్సికంలో విటమిన్‌ సి,బి,ఇ, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా లభిస్తాయి. దీన్నో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌, బీటా కెరోటిన్‌, ఎంజైమ్స్‌ శరీరానికి ఎంతో మంచివి.బీటా కెరోటిన్‌ పసుపు పచ్చ క్యాప్సికంలో అధికం. ఇలాంటి ఎన్నో పోషకాలు క్యాప్సికంలో ఎక్కువగా ఉన్నాయి. విటమిన్‌ ఎ, విటమిన్‌ సిలు టమాటాలో కన్నా క్యాప్సికంలో అధికం. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగి ఎన్నో వ్యాధులను కూడా నయం చేయడానికి క్యాప్సికంను ఉపయోగిస్తారు.
కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం, రక్తపోటులను నియంత్రణలో ఉంచడానికి ఉత్తమం క్యాప్సికం. ఆరోగ్యానికే కాక సౌందర్యానికి ఎంతో ఉపయోగం. క్యాప్సికం తీసుకోవడం వల్ల జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మొటిమల నివారిణిగా పనిచేస్తుంది. అంతేకాక, కళ్ళకు సంరక్షణ క్యాప్సికం.