శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారమే ఎందుకు చేయాలి?
లక్ష్మీదేవిని గురు, శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజి స్తారు. ఈ రోజులలో దేవిని ప్రసన్నం చేసుకుని, ఆమె ఆశీ స్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతిక రమైన స్తోత్రాలు, స్తుతులు ఆరోజునే పఠిస్తారు. ఆ రోజు కొంతమంది ఉపవాసంఉంటారు.ఈనాడుమానవులేకాదు, పురాణాలలో రాక్షసులు సైతం శుక్రవారం లక్ష్మీదేవిని పూ జించేవారనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమై న దినంగా ఎందుకు పేరుమో సింది? రాక్షసులు కూడా ఆ రోజే లక్ష్మీదేవినిఎందుకు ఆరాధించేవారు? అందునా రాక్ష ససంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజిం చడమేమిటి? ఈ సందేహాలన్నీ వస్తాయి. ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే... రాక్షసుల గురువు శుక్రాచార్యు డు. ఈ శుక్రాచార్యుల పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే శుక్రాచా ర్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవు డి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు. ఈ విధంగా లక్ష్మీ దేవికి శుక్రా చార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్ర వారం అంటే ప్రీతికరమైనది