శ్రీనాధుని చంద్రోదయ వర్ణన.!
‘’ఆతత లీల గోమల నవామ్శుక పాళిమ హాంధ కార సం –ఘాతము
మీటే నద్భుతముగా శశి లాంచను డభ్రవీదికిన్
శ్వేత వరాహ మూర్తి యగు వెన్నుడు ప్రన్నని యొంటి కోర,ధా –త్రీతల మెంత యంతయు ధరిం చిన యట్టి విజ్రుమ్భణంబు నన్’’-అంటే –
విష్ణువు వరాహావతారం ఎత్తి తెల్లగా ఉన్న ఒకే ఒక్క కోరతో భూగోళాన్ని అంతటిని అవలీలగా పైకెత్తి నట్లు
చంద్రుడు నెల వంకచేత ఆశం లో చీకట్లను అద్భుతం గా తొలగించాడు .
యెర్ర దనం తో ఉన్న అర్ధ చంద్ర బింబం తాంబూలం వేసుకోవటం వలన
యెర్ర బడ్డ తూర్పు దిక్కు అనే స్త్రీ యొక్క కింది పెదవిలాగా ఉన్నదట