ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

LORD SIVA BHAKTHI SONG WRITTEN BY SRI DEVULAPALLI KRISHNA SASTRY GARU


ఈ గీతం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన శివక్షేత్రయాత్ర సంగీత రూపకం లోనిది. 1959లో మహాశివరాత్రినాడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంనుండి ప్రసారమయింది. దీనికి సంగీతం కూర్చినది పాలగుమ్మి విశ్వనాథం. గానం చేసినది మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం.

రాగం: మార్గహిందోళం తాళం : రూపకం (దాద్రా)

శివ శివ శివ అనరాదా
శివ నామము చేదా
శివపాదము మీద - నీ
శిరసునుంచరాదా
భవసాగర మీద - దు
ర్భర వేదన ఏదా ॥

కరుణాళుడు కాదా ప్రభు
చరణ ధూళి పడరాదా
హరహరహర అంటే మన
కరువు తీరి పోదా ॥

కరి పురుగు పాము బోయ
మొరలిడగా వినలేదా
కైలాసం దిగి వచ్చి
కైవల్యం ఇడలేదా
మదనాంతకు మీద - నీ
మనసెప్పుడు పోదా
మమకారపు తేరా స్వామిని
మనసారా కననీదా ॥