ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU PURANA STORY ABOUT LORD SIVA TURNS AS CHANDRASEKHARA


శంకరుడు, చంద్రశేఖరునిగా మరిన కధ

దక్ష ప్రజాపతికి ప్రసుతి ద్వార 24 మంది, పంచజని ద్వార 62 మంది కుమార్తేలు గలరు. అందులో 27 మంది కుమార్తేలకు చంద్రునితో కళ్యాణం జరిగింది. వారు మనం నక్షత్రలుగా పిలుచుకుంటూన్న కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పూనర్వసు, పుష్య, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్తా, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పుర్వషాడ, ఉత్తరషాడ, శ్రవణ, ధనిష్ట, శతభిష,,పూర్వభాధ్ర, ఉత్తరభాధ్ర, రేవతి, అశ్వని, భరణి..

27 మందిని పెళ్ళి చేసుకున్న చంద్రుడు,రోహినితో మత్రమే ప్రేమగా ఉండటంతో మిగిలిన 26 మంది భాదపడుతు ఉండేవారు. వీరి విచారనికి కారణం తేలుసుకున్న దక్షుడు కోపంతో చంద్రుని క్షిణించిపోమ్మని శపిస్తాడు.. చంద్రుడు, బ్రతికించమని దేవులందరిని వేడుకొనగా దీనికి శివుడే తగినవాడనడంతో భోలశంకరుని క్షమించమని ప్రార్ధిస్తాడు.. శివుడు చంద్రుని క్షమించి చంద్రుని తన శిరసున ధరిస్తాడు. శివుని వద్ద ఉండటంతో చంద్రునికి ప్రాణహని లేకపోయినప్పటికిని.. దక్షుని శపం వలన క్షిణించే గుణం తప్పదని, చంద్రుడు పక్షం రోజులు ప్రకాశించడం (కృష్ణ పక్షం) తరువత పక్షం రోజులు క్షిణించడం (శుక్ల పక్షం) ఇలా సృష్టి ఉన్నంత వరకు జరుగుతుందని శివుడు తేలియజేస్తాడు.

చంద్రుని శిరసున ధరించి పరమేశ్వరుడు చంద్రశేఖరుడైనడు. ఆ రోజే సోమనాధ్ క్షేత్రం వేలసింది. అది మఘ మాస, కృష్ణపక్షం లోని చతుర్ధశి.. మనం జరుపుకుంటున్న మహాశివరాత్రి.