ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

WHO INVENTED EMAIL - COMPLICATED ISSUE OF INVENTING EMAIL



ఈమెయిల్ ను కనుగొన్నది ఎవరో తెలుసా?

వాషింగ్టన్ : ఈమెయిల్ ను ఎవరు కనుగొన్నారో తెలుసా.. భారతీయుడే!! అవును.. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్ ను తొలిసారిగా 32 ఏళ్ల క్రితం కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను కనుగొన్నారు. అప్పట్లో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొంటున్న అయ్యదురై.. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ కోసం ఈ మెయిల్ ను కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు.

వాస్తవానికి ఆయన 1978లోనే కేవలం కార్యాలయంలోనే పంపుకొనే వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి 'ఈ-మెయిల్' అని పేరుపెట్టారు. అయితే 1982లో దానికి కాపీరైట్ లభించింది. ఆ సమయంలో కాపీరైట్ పేటెంటు హక్కుతో సమానం. సాఫ్ట్ వేర్ ఆవిష్కరణలను రక్షించుకోడానికి అంతకంటే మార్గం ఉండేది కాదు. ఆయన చేసిన పరిశోధనలకు గాను 1981లో అయ్యదురైకి వెస్టింగ్ హౌస్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది. అయితే.. ఆయనే ఈమెయిల్ ను కనుగొన్నా.. కంప్యూటర్ చరిత్రలో మాత్రం వేరేవాళ్లు కూడా తామే కనుగొన్నట్లు చెబుతుండటంతో కొంత వివాదం ఏర్పడి ఆయన పేరు పెద్దగా బయటకు రాలేదు.