ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ANCIENT HISTORICAL STORY OF INDIAN TRADITIONAL MUGGU / KOLAM


ముగ్గులు

మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు.ముగ్గులు వేయమని మనం ఋషులు చెప్పడానికి అనేకానేక శాస్త్రీయ కారణాలున్నాయి.

మనం ధర్మం స్త్రీలు కష్టమైన పనులు చేయకూడదని చెప్పింది(ఉద్యోగాలు చేయవద్దని చెప్పలేదు,గుర్తుంచుకోండి).మనది వ్యవసాయ ప్రధానమైన దేశం.పొలం పనులు కష్టంతో కూడినవి కనుక స్త్రీలు చేసేవారు కాదు.మరి వారికి వ్యాయమం ఏది?అలాగే రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది.నడుము ఒంచి పనిచేయకపోతే నడుముభాగానికి సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.పురుషులు వ్యవసాయానికి వెళ్ళెవారు,నడుము వంచి పనిచేయాలి పొలంలో కనుక వారికి నడుముకు సంబంధించిన వ్యాయమం అవుతుంది.మరి స్త్రీలకో?

ఉదయం లేవగానే ఏ ఆహరం తీసుకోకముందు చేసే వ్యాయమం సత్ఫలితాలనిస్తుందని మనకు తెలుసు.ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి.చుక్కలు పెడతారు కదా,అవి కలపడానికి అటు,ఇటు చేతులు,నడుము కదపాలి.ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు.దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు.అందుకే ఉదయమే స్త్రీలు ముగ్గులు వేయడం మన సంప్రదాయం.

స్త్రీలే వేయాలా అంటే కాదు అనే చెప్పాలి.గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళ్తాడు.దేవుడి వద్ద శుభరపరిచి,ఆయనే వేస్తారు(ఎందుకంటే గర్భ గుడిలోనికి పూజారి తప్ప వేరేవారు ప్రవేశించరు కనుక).అలాగే సూర్య భగవనుడికి సంబంధించిన పూజలు చేసే సమయంలో,ఇతర దేవతాపూజలలోనూ కొన్ని రకాల యంత్రాలను వేయవలసి ఉంటుంది.అప్పుడు కూడా ఉపాసకులే వేస్తారు.

స్త్రీలకు సృజనాత్మకత ఎక్కువ.వారిలోని సృజనాత్మకతను బయట ప్రపంచానికి తెలియపరుస్తుంది ముగ్గు