ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FOR BEAUTINESS NOT ONLY MAKE UP IS SUFFICIENT - EAT PROTEINS FOODS, FRUITS, VEGETABLES, GREEN LEAVES FOR GOOD HEALTH AND FOR PERFECT BEAUTINESS


మేకప్‌ సరిపోదు పోషకాలూ తీసుకోండి

చర్మ సౌందర్యం కోసం చాలా మంది మేకప్‌పైనే ఆధారపడతారు. దానికోసం వేలకొలది డబ్బు ఖర్చుచేస్తుంటారు. బ్యూటీపార్లర్‌ చుట్టూ తిరుగుతుంటారు. కాని మోము మెరిసిపోవాలంటే కేవలం మేకప్‌కు ప్రాధాన్యం ఇస్తే సరిపోదు. చక్కటి పోషకాహారం తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. మీ మోము తాజాగా మెరవడానికి ఐదు రకాల ఆహారాన్ని తరచూ తీసుకుంటే చాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు. 
* నిమ్మరసం: చర్మాన్ని తాజాగా ఉంచి, ముడతలు పడనీయ కుండా చూస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకున్నా లేదా రోజూ అర గ్లాసుడు తీసుకున్నా మీ చర్మం కాంతివంతం అవుతుంది. నిమ్మరసంతో చేసిన పదార్థాలను విరివిగా తినడం చేస్తే కూడా ఫలితం ఉంటుంది.
* గుడ్లు: రోజుకో గుడ్డు తింటే మంచిది అంటారు. తినడమే కాదు. గుడ్డులోని తెల్లసొనను తీసి ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మం నునుపుదేలి మెరుస్తుంది.

* తేనె: ఉదయాన్నే ఒక చెక్క నిమ్మరసంలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె వేసుకుని తాగితే మంచిది. అలాగే దీనిని రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు రాకుండా ఉంటాయి.
* స్ట్రాబెర్రీస్‌: ఎర్రని స్ట్రాబెర్రీలు నెలలో నాలుగైదు సార్లు తినడం వల్ల చర్మానికి మంచి పోషకాహారం అందుతుంది. విటమిన్‌ 'సి' యాంటిఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని మెత్తగా చేసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
* అరటిపళ్లు: రోజుకో అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలా తింటు న్నప్పుడు చిన్న ముక్కతో ముఖ మంతా రుద్దుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే చర్మానికి మేలు. తేనెలో ముంచి రాసుకున్నా ముఖం తాజాగా కనిపిస్తుంది.