స్థూలకాయం తగ్గడానికి ఆహార నియమాలు
. 1) ఉదయం 5 గంటలకు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రెండుచెంచాల తేనె వేసుకుని తాగండి
. 2) ఉదయం 8 - 9 మధ్య ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ గాని , కాయగూరల జ్యూస్ + 250 గ్రాముల కూరగాయ ముక్కలు ( సలాడ్ ) తిని గాని లేదా మొలకెత్తిన గింజలు ( పెసలు వేరుశనగ బటాని శనగలు బాదాములు ఖర్జూరం వంటివి కలగలిపి ) + ఒక కప్పు వెన్నలేని పెరుగు గాని పాలు కాని తీసుకోండి
. 3) 11 - 12 మధ్య భోజనం : రెండు పుల్కాలు ( నూనె లేని చపాతీలు ) 500 గ్రాముల ఉడికించిన కూరగాయల్ ముక్కలతో + సలాడ్ 200 గ్రాములు + మొలకలు 50 గ్రాములు
. 4) 2గంటలకు ఒక గ్లాసు మజ్జిగ లేదా నీరు +తేనె +నిమ్మ
.5) కూరగాయల రసం 200 మిల్లీ లీటర్లు ( కూల్ డ్రింక్ సీసాడు )
. 6) సాయంత్రం 6-7 గంటలకు : రుతువుని అనుసరించి ఫలాలను తినండి . + 50 గ్రాముల మొలకలు తినండి .
. 7) రాత్రి 8.30 కి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రెండుచెంచాల తేనె వేసుకుని తాగండి
ఇది మీ దినచర్య చేసుకోండి ( మీకు బరువు తగ్గాలి అని ఉంటేనే సుమా ! ఎప్పుడో ఒకప్పుడు చచ్చేదే కదా ! నేను నోరు అదుపులో ఉంచుకుని సాధించేదేముంది ? వచ్చే జన్మలో చూద్దాం లే అనుకునే వారికి ఈ ఆహార నియమం వర్తించదు )
నిషిద్ధ వస్తువులు :
పొగ త్రాగడం , మద్య సేవనం , చిగడ దుంప , బంగాల దుంప , వంకాయ , దుంపకూరలు, తీ , కాఫీ , పంచదార్ , తీపి వస్తువులు , వేపుళ్ళు ,